డబ్య్లూహెచ్‌వో సాల్ట్ గురించి చెప్పిన చేదు నిజం

What W.H.O Said About Salt Is The Bitter Truth,Salt Is The Bitter Truth, W.H.O, eat too much salt,salt,The bitter truth about salt,Salt Trumps Bitter,Flavor Can Be Painful,The bitter truth,Healthy diet,Healthy Food,healthy eating,Simple Steps to a Healthy Diet ,Mango News mango news Telugu,
Salt, eat too much salt,W.H.O said about salt is the bitter truth

చాలామంది ఫుడ్ తినేటప్పుడు  అందులో కాస్త ఉప్పు తక్కువైనా అస్సలు కాంప్రమైజ్ అవరు. కొంచెం ఉప్పు తక్కువైనా కూడా వేసుకుని మరీ తింటారు తప్ప అస్సలు సర్దుకుపోరు. నిజమే వంటకాల రుచిని పెంచడంలో ఉప్పు ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఒప్పుకోవాల్సిందే.  ఎందుకంటే ఉప్పు లేనిది ఏ వంటకాన్ని కూడా తినలేం. అయితే రుచిని పెంచుతుంది కదా అని ఉప్పును ఎక్కువగా తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. ఉప్పును ఎప్పుడు కూడా పరిమితంగా ఉంటే ఆరోగ్యానికి మంచిదని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు సూచిస్తున్నారు. ఏ పదార్ధంలో అయినా ఉప్పు, పంచదార రుచిని పెంచుతాయి. కానీ ఈ రెండు పదార్ధాలను పరిమితికి మించి ఉపయోగిస్తే ముప్పు తప్పదని డబ్య్లూహెచ్‌వో చెబుతోంది . మరీ ముఖ్యంగా ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంపై ఊహించని స్థాయిలో నష్టం జరుగుతుందని పేర్కొంది.

ఆహారంలో కానీ మరే ఇతర తినే పదార్ధాల్లో అయినా ప్రతీ రోజు  ఒక మనిషి కేవలం 5 గ్రాములు మించి సాల్ట్‌ను తీసుకుంటే అది మనిషి హెల్త్‌పై ఊహించని స్థాయిలో నష్టం కలిగిస్తుందని డబ్లూహెచ్‌ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా చెప్పాలంటే ఉప్పు ప్రాణానికి ముప్పుని ..డబ్య్లూహెచ్‌వో తాజా  అధ్యయనంలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా ప్రాసెస్‌ చేసిన ఆహారంలో సాల్ట్ ఎక్కువగా ఉండటం వల్ల వెంటనే వాటిని తినడం  మానేయాలని వెల్లడించింది.

ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల ప్రతీ ఏడాది 18.9 లక్షల మంది మృతి చెందుతున్నారన్న భయంకర విషయాన్ని డబ్య్లూహెచ్‌వో వెల్లడించింది. సాల్ట్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు, గుండె సమస్యలు, గ్యాస్ట్రిక్‌, క్యాన్సర్‌, ఊబకాయం, కిడ్నీ వ్యాధులు వంటి  బారినపడే అవకాశాన్ని  పెంచుతుందని  డబ్య్లూహెచ్‌వో తెలిపింది. శరీరానికి సోడియం చాలా కీలకమే అయినా.. రోజుకు 2000 మిల్లీగ్రాములు మించి తీసుకోకూడదని డబ్య్లూహెచ్‌వో హెచ్చరిస్తోంది.

మోతాదుకు మించిన సాల్ట్ శరీరంలోకి వెళ్లడం వల్ల గుండె, కిడ్నీ, మెదడుపై ఎక్కువ ప్రభావం చూపుతోందన్న డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంతేకాకుండా శరీరంలో కీలక అవయవాలు కూడా దెబ్బతిని ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీంతో పాటు అధిక రక్తపోటు సమస్య పెరిగి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తుంది. అయితే సాల్ట్ లేకపోతే ఆహారానికి రుచి ఎలా అన్న ప్రశ్నకు ఉప్పుకు బదులు నిమ్మరసం, వెనిగర్‌, వామ్ము, నానబెట్టిన సబ్జా గింజలు మొదలైనవి  వాడొచ్చునని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ