
పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొంటున్న భారత జట్టులో 117 మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ ఒలింపిక్ జట్టులో అతి పిన్న వయస్కురాలైన ధినిధి దేశింగు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. స్విమ్మర్ ధీనిధి కేవలం 14 ఏళ్ల వయస్సులో అతిపెద్ద క్రీడల వేదిక అయిన ఒలింపిక్స్‌లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించబోతుంది . యూనివర్సాలిటీ కోటా సహాయంతో ధీనిధి దేశింగుకి పారిస్ వెళ్లే అవకాశం వచ్చింది. ఒకప్పుడు నీళ్లలో కాలు పెట్టాలంటేనే భయపడే ధినిధి..ఇప్పుడు పారిస్ ప్రయాణం చేరుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ధీనిధి కేవలం మూడు ఏళ్ల వయస్సులో ఈత కొట్టడం మొదలు పెట్టింది.
మూడేళ్లకు అందరిలా గలగలా మాట్లాడలేకపోయిన ధీనిధిని చూసి ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెందారు. డాక్టర్ సహాయంతో ఆమెలో ఆత్మవిశ్వాసం పెరగలేదని. దీనికోసం ఆమెను ఏదైనా ఆటల్లో ప్రోత్సహించాలని సూచించారు. దీంతోనే ధీనిధిన ఎలాగైనా క్రీడల్లో చేర్చాలని పేరెంట్స్ నిర్ణయించుకున్నారు. కానీ దీనికి కూడా ధీనిధి మొదట్లో ఇష్టపడలేదు.దాని తర్వాత కోచ్ లు కూడా ఆశ్చర్యపడేలా స్విమ్ చేస్తూ వచ్చిన ధీనిధి ఇప్పుడు ఒలింపిక్స్ లో అడుగుపెడుతుండటం అందరినీ ఆనందంలో పడేస్తుంది.
ఇటు.. తనకు నీరు అస్సలు ఇష్టం లేదని..తాను లోపలికి వెళ్లాలని అనుకోలేదంటూ ఆనాటి విషయాలను మీడియా ముందు పంచుకున్నారు ధీనిధి. తాను తన పాదాలను కూడా కొలనులో ఉంచలేకపోయానని..తనకు చాలా కష్టంగా అనిపించేదని చెప్పింది. మరుసటి సంవత్సరం వెళ్ళేటప్పటికి కూడా ఇంకా తనలో భయం పోలేదని అంది. కానీ తనను ప్రశాంతగా, ఆత్మవిశ్వాసంతో ఉంచటానికి తల్లిదండ్రులు ఈత నేర్పించారని తెలిపింది.
ఇక్కడి నుంచి ధీనిధి ప్రయాణం మొదలైంది. ధీనిధికి నీటి భయం పోయింది కానీ.. టోర్నీల భయం మాత్రం పోలేదు. చివరకు ఇప్పుడు ఒలింపిక్స్ కు చేరుకోవడంతో.. తన కుమార్తె ప్రతిభను తాను నమ్ముతానని, అయితే ఆమెలో భయాన్ని తొలగించలేకపోతున్నానని.. ఆమె తల్లి జెస్సిత చెబుతున్నారు. ప్రతి టోర్నమెంట్‌కు ముందు లాగా ఇప్పుడు కూడా ఒలింపిక్స్ కోసం ఆమె ఒత్తిడిని అనుభవిస్తోందని అంటున్నారు. దానివల్ల పోటీకి ముందు ఆమెకు జ్వరం లేదా వాంతులు ప్రతిసారీ వస్తాయని ఆమె చెబుతున్నారు.
కాగా.. జాతీయ క్రీడల్లో ధీనిధి ఏడు బంగారు పతకాలను సాధించింది. అంతేకాకుండా ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కురాలుగా ధీనిధి రికార్డ్ సృష్టించింది. 200 మీటర్ల ఫ్రీస్టైల్ లో జాతీయ రికార్డ్ ను కూడా నెలకొల్పింది. గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ధీనిధి పాల్గొంది. ప్రస్తుతం ధీనిధి పారిస్ ఒలింపిక్స్‌లో 200 మీటర్ల ఫ్రీస్టైల్‌లో పాల్గొనబోతోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE