
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజయి.. అతి కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుల మనుసును దోచిన సినిమా 12th ఫెయిల్. చిన్న సినిమాగా విడుదలైన 12th ఫెయిల్ మూవీ పెద్ద హీరోలకు సవాల్ విసురుతూ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 5 రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టి రూ.100 కోట్ల క్లబ్ కు చేరింది. ’12th ఫెయిల్ మూవీ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ చిత్రం అవార్డుతో సహా ఐదు అవార్డులను గెలుచుకుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు సాధించిన 12th ఫెయిల్.. తాజాగా జాతీయ అవార్డుల బరిలోనూ నిలిచింది. వచ్చే నెలలో జరగనున్న జాతీయ చలనచిత్ర అవార్డుల ఫంక్షన్లో ఈ సినిమా పోటీపడబోతోంది. అయితే ఇప్పటికే హీరో విక్రాంత్ మస్సేకు జాతీయ అవార్డు కచ్చితంగా వస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.
దీనిపై తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన విక్రాంత్ మస్సే.. జాతీయ అవార్డు కంటే ప్రేక్షకుల ఆదరణ గొప్పదని చెప్పుకొచ్చారు. 12th ఫెయిల్ చిత్రం జాతీయ అవార్డుల బరిలో నిలవడం ఆనందంగా ఉందన్న విక్రాంత్.. ఇప్పటివరకు ఈ చిత్రం గురించి ఎన్నో ప్రశంసలు వచ్చాయన్నారు. గొప్ప వేదికలపై ఈ సినిమాను ప్రదర్శించారని.. తన నటనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని విక్రాంత్ మస్సే చెప్పారు. జాతీయ అవార్డు వస్తుందని అందరూ మాట్లాడుకుంటున్నారన్న విక్రాంత్… ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చారు. ఆవేశం, ది గోట్ లైఫ్ వంటి చిత్రాల్లో స్టార్‌ల నటన అద్భుతమన్న ఆయన.. వారి సరసన తాను ఉండడం తన అదృష్టం అన్నారు. అయితే జాతీయ అవార్డు వస్తుందా? రాదా? అనే విషయం గురించి ఇప్పుడే మాట్లాడుకోవడానికి సమయం కాదని సున్నితంగా చెప్పిన విక్రాంత్… అవార్డు కంటే ప్రేక్షకుల ఆదరణ గొప్పదని చెప్పారు.
12th ఫెయిల్ మూవీలో విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించారు. విధు వినోద్ చోప్రా డైరక్షన్ వహించిన ఈ మూవీ.. మనోజ్ కుమార్ శర్మ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందించారు. 12వ తరగతి ఫెయిల్ అయిన ఓ యువకుడు..తన కృషి, పట్టుదలతో ఐపీఎస్ ఎలా అయ్యాడనేదే ఈ సినిమా స్టోరీ. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ జీవితం ఆధారంగా అనురాగ్ పాఠక్ రాసిన నవలను.. విధు వినోద్ చోప్రా వెండితెరపై ఆవిష్కరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE