శ్రావణ మాసం, కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది నాన్ వెజ్ ముట్టుకోరు. మరికొంతమంది అయితే అసలు ఆ నెల రోజులు నాన్ వెజ్ వాసన కూడా రాకూడదంటూ ..మరీ తినాలని ఉంటే బయటకు వెళ్లి తిని రావాలని ఇంట్లో వారికి చెబుతారు. అందుకే ప్రతీ ఏడాది ఈ రెండు మాసాలలో చికెన్ రేట్లు పడిపోతాయి. దీనిలో భాగంగానే ఇప్పుడు చికెన్ రేట్లు భారీగా పడిపోయాయి.
శ్రావణమాసంలో నాన్‌వెజ్ కు దూరంగా ఉండటంతో డిమాండ్ తగ్గితే ధరలెలా దిగొస్తాయో తెలిపే ప్రత్యక్ష ఉదాహరణగా.. చికెన్ ధరలు భారీగా పడిపోయాయి.మొన్నటివరకూ కిలో 300 రూపాయల వరకు పైగా వెళ్లిన చికెన్ ధరలు మెల్లగా దిగివస్తున్నాయి. ఒకప్పుడు చికెన్ ధరలు బాగా పెరగడంతో చాలా మంది కేజీ చికెన్ బదులు అరకేజీ చికెన్ కొని సరిపెట్టుకున్నారు. అయితే ఇప్పుడు చికెన్ ధరలు తగ్గడంతో.. పండుగలతో సంబంధం లేకుండా నాన్‌వెజ్ తినే వారికి ఊరటనిస్తోంది.శ్రావణ మాసం ఎంటర్ అవగానే చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో కేజీ స్కిన్ లెస్ చికెన్ ధర.. 150 రూపాయల నుంచి 180 రూపాయల మధ్య అమ్ముతున్నారు. లైవ్ కోడి అయితే కేజీ 100 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యనే అమ్ముతున్నారు .
శ్రావణ మాసం వల్లే చికెన్ ధరలు దిగొస్తున్నాయి. శ్రావణమాసం మొదలై 5 రోజులు పూర్తైంది. ఎక్కువ మంది ఈ మాసంలో చికెన్ , మటన్, ఫిష్ జోలికి వెళ్లరు. శ్రావణమాసమంతా.. ఉపవాసాలు, పూజలతో ఉండడం వల్ల.. కొనుగోళ్లు పడిపోయాయి. కానీ కోళ్ల ఫాంలలో ఒక సమయం దాటిన తర్వాత కోళ్లను అక్కడ ఉంచరు.
అలా ఉంచితే కోళ్లను దాణా వేస్తూ పెంచడం యజమానులకు కష్టం అవుతుంది. దీనివల్ల కొనుగోళ్లు పెద్దగా లేకపోయినా వాటిని చికెన్ షాపులకు పంపేస్తారు.ఈ కారణం వల్లే చికెన్ ధరలు తగ్గుతాయని అంటున్నారు. శ్రావణమాసం చివరి వరకు చికెన్ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. మరోవైసు హైదరాబాద్‌లో కిలో మటన్ ప్రాంతాన్ని బట్టి కిలో 700 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు అమ్ముతున్నారు.