మూలికే అని లైట్ తీసుకోవద్దు

Benefits Of Using Ashwagandha, Ashwagandha Benefits, Health Benefits of Ashwagandha, Ashwagandha Benefits For Men, Ashwagandha Benefits For Women, Advantages of Ashwagandha, Ashwagandha, Ashwagandha Herb, Benefits, Ashwagandha Side Effects, Ashwagandha Powder, Ayurveda Medicine, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

ఆయుర్వేదంలో అశ్వగంధకు ఉన్న పేరు అంతా ఇంతా కాదు. దీన్ని ముఖ్యంగా సంతానోత్పత్తిని ప్రసాదిందే దివ్యౌషధంగా భావిస్తారు. అశ్వగంధ మన పూర్వీకుల కాలం నుంచి అందుబాటులో ఉన్న మూలిక. దీన్ని వాడటం వల్ల మనలో ఒత్తిడిని తరిమేస్తుంది. ఇది మెదడుకు కూడా మేలు చేస్తుంది.

షుగర్‌ లెవెల్స్‌ తగ్గిస్తుంది. అంతేకాదు స్పెర్మ్‌ కౌంట్‌ పెంపునకు ఇది చాలా ఉపయోగపడుతుంది. దాదాపు మూడువేల ఏళ్లకు పైగా దీన్ని వాడుతున్నారు.
బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ పెరిగిపోతుంటే… అలాంటి వారు అశ్వగంధను వాడొచ్చు. ఇది ఇన్సులిన్‌ స్థాయిని పెంచుతుంది.

దీనిలో వితాఫెరిన్‌ అనే పదార్థం క్యాన్సర్‌ను అడ్డుకోగలదని పరిశోధనల్లో తేలింది.
ఒత్తిడిని పెంచే హార్మోనును ఎక్కువగా విడుదల అవ్వకుండా అశ్వగంధ చేయగలదు.

టెన్షన్లు, ఒత్తిడి, కంగారు, ఆందోళన, హడావుడి, బిజీ లైఫ్‌ స్టైల్‌ ఉంటున్నట్లైతే… అశ్వగంధ వాడటం మంచిది. ఎందుకంటే అశ్వగంధ బ్రెయిన్‌ని కాపాడుతుంది.

డిప్రెషన్‌కు గురై చనిపోవాలనుకునే వారికి కూడా అశ్వగంధ మంచి ఔషధమనే చెప్పాలి. అశ్వగంధ వల్ల నెగెటివ్‌ ఆలోచనలు తగ్గి పాజిటివ్‌గా మారుతారు.
పిల్లలు పుట్టని మగవారికి సరైన మందు ఈ అశ్వగంధ. ఇది స్పెర్మ్‌ కౌంట్‌ను పెంచడానికి ఈ మూలికకు తిరుగులేదు.

కండరాల్లో బలం పెంచడంలో అశ్వగంధకు మంచి పేరుంది. మగవారు రోజుకు 750 మి.గ్రా చొప్పున నెలరోజులపాటు తీసుకుంటే కండరాలు ఉక్కులా తయారవుతాయి.

శరీర ఉష్ణోగ్రతను కూడా కంట్రోల్‌ చెయ్యడంలో అశ్వగంధ బాగా పనిచేస్తుంది. వేడిని తగ్గించుకోవడానికి ఇది ఓ దివ్యౌషధం.
చెడు కొలెస్ట్రాల్‌ను అశ్వగంధ తొలగిస్తుంది. దీనిద్వారా గుండెకు మేలు చేస్తుంది.

మతిమరపు లక్షణాలు కనిపించేవారు అశ్వగంధ వాడితే మంచిది. ఏ కారణంగానైనా మెదడు దెబ్బతింటే… వారు అశ్వగంధ వాడాలని డాక్టర్లు కూడా సూచిస్తుంటారు.

అశ్వగంధ ఆన్‌ లైన్‌ ఈ-కామర్స్‌ సైట్లలో లభిస్తోంది. లేదంటే ఆయుర్వేద షాపుల్లో ఉంటుంది. అశ్వగంధ వల్ల పెద్దగా సైడ్‌ ఎఫెక్టులు ఏవీ లేవు. ఐతే… గర్భిణీలు, బాలింతలు మాత్రం దీన్ని తీసుకోకూడదు. ఏది ఏమయినా అశ్వగంధ వాడేముందు ఒకసారి డాక్టర్ సలహా తీసుకుని వాడటం మంచిది.