టేబుల్ రోజ్ ఉపయోగాలు

Uses Of Table Rose,Mango News Telugu,Mango News,Table Rose,Table Rose Multicolour,Table Rose Plants,Uses Of Table Rose For Hair,Uses Of Table Rose For Skin,Table Rose Colours,Table Rose For Skin Whitening,Health Tips,Skin Benefits,Table Rose Tips,Table Rose Face Mask

చిన్నప్పటి నుంచి చూస్తున్నా సరే ఈ జనరేషన్ లో చాలామంది గడ్డి గులాబీ అంటే తెలియదు. కానీ టేబుల్ రోజ్ అంటే మాత్రం కొంతమందికి తెలుసు. పార్కుల్లో, రోడ్డు పక్కనా కనిపిస్తూ సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తున్నా.. బాగుంటాయి ఈ పువ్వులు అనుకోవడమే తప్ప.. దాని ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియవు. ఈ మొక్క ఎటువంటి ప్రదేశంలో నైనా బ్రతకగలదు. అంతే కాకుండా దీని పూలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఒకసారి ఈ మొక్క ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టేబుల్ రోజ్‌లో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే , ఈ మొక్కను ఎవరు కూడా వదిలిపెట్టరు. ఈ మొక్క చర్మం మీద ఉండే నల్లటి మచ్చలను, మొటిమలను తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

ఈ మొక్కలో వున్న పువ్వును కోసుకొని, ఒక మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం తేనెను కలిపి ముఖానికి పూయాలి. తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవడం వల్ల, ముఖం అందంగా మెరుస్తుంది. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల తప్పకుండా ఫలితం లభిస్తుంది.

ఇక జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉండేవారికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కల కాండం, ఆకులను బాగా ముద్దగా నూరి, అందులోకి కొంచెం స్వచ్ఛమైన కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించుకోవడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది.

ఈ మొక్క యొక్క రసాన్ని ఏదైనా గాయాలు అయినప్పుడు పట్టించడం వల్ల, ఆ గాయం నుంచి రక్త కారే సమస్య తగ్గుతుంది. .

ఇక అంతే కాకుండా చర్మంపై వచ్చిన పొక్కులతో పాటు..క్షయ వ్యాధి పొక్కులను పోగొట్టుకోవడానికి కూడా గడ్డి గులాబీ ఉపయోగపడుతుంది. ఈ పూలను బాగా నూరి చర్మంమీద పట్టించడం వల్ల పొక్కులు తగ్గిపోతాయి.

ఈ మొక్కల వేరుతో కషాయం చేసుకుని తాగడం వలన దగ్గు నుంచి విముక్తి పొందవచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న గడ్డి గులాబీ ఎక్కడ కనిపించినా ఇంట్లోకి తీసుకువచ్చి పెంచుకోవడానికి రెడీ అయిపోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.