గూగుల్‌లో వీటి గురించి సెర్చ్ చేస్తున్నారా? జాగ్రత్త..

Searching About These On Google Be Careful

గూగుల్ అంటేనే క్షణాల్లో తెలిసిపోయే సర్వ సమాచారం తెలిసిపోతుంది.అందుకే.. ప్రపంచంలోనే బాగా పాపులర్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్ ఏదైనా ఉందంటే అది గూగులే అంటారు. ఏ అనుమానం వచ్చినా.. ఏ ఇన్ఫర్మేషన్ కోసం వెతికినా క్షణాల్లో మన ముందుంచుతుంది గూగుల్.కానీ మారుతున్న కాలంతో పాటు ఈ బిగ్గెస్ట్ ఇన్ఫర్మేషన్ హబ్.. కావాల్సిన సమాచారాన్ని ఇచ్చినా కూడా తమ యూజర్ల భద్రతాపరమైన విషయంలోనూ చర్యలు తీసుకుంటోంది.

వీటిలో భాగంగా కొన్ని నిబంధనలు ఇప్పటికే తీసుకొచ్చింది. వీటి ప్రకారం గూగుల్ ప్రైవసీ, ఐటీ నిబంధనలు, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. పబ్లిక్ డొపమైన్లలో సెర్చ్ చేయకూడనివి లేదా నిషేధించబడినవి ముఖ్యంగా మూడు ప్రధాన విషయాలు ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియదు. ఒక వేళ వీటిని పొరపాటున సెర్చ్ చేసిన నేరమే అవుతుంది.. జైలుకెళ్లడం కూడా ఖాయం కాబట్టి పొరపాటున కూడా ఈ మూడింటి దగ్గరకు వెళ్లొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఐటీ నిబంధనల ప్రకారం.. గూగుల్లో చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల సాహిత్యాన్ని కానీ, చిన్న పిల్లల అశ్లీల వీడియోలను కానీ దానికి సంబంధించిన కంటెంట్‌ను కానీ సెర్చ్ చేయడం నేరం. ఈ విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అంశాలను వెతికితే 5 నుంచి 7 ఏళ్ల వరకూ జైలు శిక్షపడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అలాగే ప్రైవసీ పాలసీలో భాగంగా.. గూగుల్లో ఎట్టి పరిస్థితిల్లోనూ బాంబు తయారీకి సంబంధించిన సమాచారాన్ని కానీ బాబు తయారీ మార్గాలను కానీ సెర్చ్ చేయకూడదు. అలా చేస్తే వివిధ పద్ధతుల్లో గూగుల్ వెంటనే గుర్తించి..వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, సంబంధింత అధికారులకు సిఫార్సు చేస్తుంది. దీంతో జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఈ రెండిటితో పాటు గూగుల్‌లో.. హ్యాకింగ్ మెథడ్స్ గురించి కూడా వెతకడాన్ని కూడా నేరంగానే పరిగణించబడుతుంది. ఇలాంటి సమాచారాన్ని ఇవ్వడానికి గూగుల్ అస్సలు ఇష్టపడదు. పైగా నిషేధించబడిన అంశంలో ఇది ఉంది కాబట్టి పొరపాటున సెర్చ్ చేసినా.. చట్టం ప్రకారం జైలుకు వెళ్లాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.