విస్కీ కలిపిన ఐస్‌క్రీమ్‌లు విక్రయిస్తున్న ఐస్‌క్రీమ్ పార్లర్లపై హైదరాబాద్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్టీఎఫ్ చీఫ్ ప్రదీప్‌రావు బృందం జరిపిన దాడిలో జూబ్లీహిల్స్ లోని ఓ ఐస్‌క్రీమ్ దుకాణంలో ప్రతి కిలో ఐస్‌క్రీమ్‌లో 60 మిల్లీలీటర్ల విస్కీని కలిపి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దుకాణంలో 11.50 కిలోల విస్కీ ఐస్‌క్రీమ్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఐస్ క్రీమ్ పార్లర్ నిర్వహిస్తున్న దయాకర్ రెడ్డి, శోభమ్మలను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఐస్‌క్రీమ్ పార్లర్ శరత్ చంద్రారెడ్డికి చెందినది. ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించేందుకు నిందితులు తమ ఉత్పత్తులను ఫేస్బుక్లో కూడా ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని 1, 5వ రోడ్డులోని అరికో కేఫ్‌తో పాటు ఇతర ఐస్‌క్రీమ్ పార్లర్లపై విస్కీ కలిపి ఐస్‌క్రీం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు. తనిఖీల్లో ఐస్‌క్రీమ్‌లో 100 పైపర్ విస్కీ వాడినట్లు నిర్ధారణ అయింది.
మైనర్లకు విక్రయించినట్లు ఆధారాలు లేవు
ఈ ఐస్‌క్రీమ్‌లను పిల్లలు, యువత భారీ మొత్తంలో కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో తనిఖీలు నిర్వహించి ఐస్‌క్రీమ్ పార్లర్ యజమానులు దయాకర్ రెడ్డి, శోభన్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విస్కీ-ఐస్‌క్రీమ్‌లను పార్టీకి సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విచారణలో తేలింది. విస్కీ కలిపిన ఐస్ క్రీం యువత, చిన్నారులను విశేషంగా ఆకర్షిస్తోందన్నారు. అయితే పార్టీ ఆర్డర్ల కోసం విస్కీ ఐస్ క్రీమ్స్ తయారు చేసి ఫేస్ బుక్ లో ప్రచారం చేస్తున్నాడు. మైనర్లకు విస్కీ కలిపిన ఐస్‌క్రీం విక్రయిస్తున్నట్లు మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు తెలిపారు. . నగరంలో వీరికి ఇంకా ఎన్ని ఐస్‌క్రీమ్ పార్లర్లు ఉన్నాయి, ఇప్పటివరకూ జరిగిన విక్రయాలు ఎన్ని? అన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డుపై గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి సుంకం చెల్లించకుండా విక్రయిస్తున్న రూ.3.85 కోట్ల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.