బార్లీ గింజలతో బెనిఫిట్స్.. డైలీ తాగితే బోలెడు ఉపయోగాలు

Benefits Of Barley Seeds, Barley Seeds Advantages, Barley Seeds Uses, Barley Seeds For Health, Benefits Of Barley Seeds, Drinking Barley Daily, Health Benefits of Barley, Benefits Of Barley Water, Lower Cholesterol, Blood Sugar, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness Tips, Mango News, Mango News Telugu

బార్లీ గింజల పేరు ఒకప్పుడు పల్లెటూరులో మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు సిటీజనులు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ సూత్రాన్ని ఫాలో అయిపోయి బార్లీని తెగ వాడేస్తున్నారు. బార్లీలో ఉన్న బెనిఫిట్స్ తెలుసుకుని మరీ ఫాలో అయిపోతున్నారు. బార్లీలో ఉండే ఉపయోగాలేంటో ఇప్పుడు చూద్దాం..
బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయి.
బార్లీలో ఉండే విటమిన్-బి కి నీటిలో కరిగే గుణం ఉంది. బార్లీ నీరు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంచే ఒక అద్భుత పానీయమని చెప్పొచ్చు. ప్రతిరోజూ ఒక గ్లాసు బార్లీ వాటర్ తీసుకుంటే మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.
బార్లీ గింజల పానీయం శృంగార సామర్థ్యాన్ని పెంచుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గుప్పెడు బార్లీ గింజలను కానీ, రెండు స్పూన్ల బార్లీ పొడిని కానీ అర లీటరు నీళ్లల్లో వేసి పావు లీటరు అయ్యే వరకు మరిగించి నలబై రోజులు తీసుకోవడం వలన శృంగార సామర్థ్యం పెరగుతుంది. అంతేకాకుండా మగవారిలో వీర్యకణాల సమస్యలు తొలగి సంతానం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
మహిళల్లో ప్రసవం తర్వాత బిడ్డకు తగినన్ని పాలు పడనట్లయితే రోజూ బార్లీ నీటిని ఒక కప్పు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు తల్లి బిడ్డ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే యూరినరీ ప్రాబ్లెమ్ ఉన్నా బార్లీ వాటర్ ఎక్కువ తీసుకుంటే వెంటనే ఫలితం ఉంటుంది.
బార్లీని నీళ్లలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. ముఖ్యంగా ఒంట్లో నీరు చేరిన గర్భిణీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది. జ్వరంతో బాధపడేవారు తక్షణ శక్తి కోసం బార్లీ వాటర్ తాగితే మంచిది.
బార్లీలో ఉండే బీటా గ్లూకాన్ విసర్జన క్రియలో శరీరం నుంచి విష పదార్దాలను బయటకు నెట్టివేయడంలో సహాయపడటమే కాక హెమోరాయిడ్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా మలబద్దకాన్ని తగ్గిస్తుంది. దీనివల్ల పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గించి ప్రేగుల్ని శుభ్రంగా ఉంచుతుంది.