బుల్లితెరలో ప్రసారమయ్యే రియాల్టీ షోలలో అన్నింటికంటే బాగా పాపులర్ అయిన షో బిగ్ బాస్ అంటే ఒప్పుకుని తీరాల్సిందే అడల్ట్స్ షో అంటూనే చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజాగా తెలుగులో సీజన్ బిగ్ బాస్ 8 నడుస్తుండగా, 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టి.. ఇద్దరు కంటెస్టెంట్స్ వెళ్లిపోయారు.
ఎప్పటిలాగే నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ఈ సరికొత్త సీజన్.. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అన్లిమిటెడ్ మనీ అంటూ మొదలైన బిగ్ బాస్ హౌస్‌లో ప్రస్తుతం 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీకి కూడా ముహూర్తం రెడీ అయిపోయిందట. వైల్డ్ కార్డు పేరుతో.. ఈసారి ఏకంగా నలుగురు కొత్త కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించబోతున్నారన్న టాక్ నడుస్తోంది.
గత సీజన్స్‌తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 చాలా తక్కువ టీఆర్పీతో మొదలైంది. దీనికి కారణం హౌస్లో అడుగు పెట్టిన కంటెస్టెంట్స్ అంతా కొత్త ముఖాలే కావడమే. కానీ ఆ తరువాత వారం రోజులకే టీఆర్పీ రేటింగ్ టాప్‌లోకి దూసుకెళ్లడం బిగ్ బాస్ నిర్వాహకులు కూడా షాక్ అయ్యారు. అన్ని భాషల్లోని బిగ్ బాస్ తో పోల్చుకుంటే.. తెలుగు బిగ్ బాస్ ఈ సీజన్లో టీఆర్పీ రేటింగ్ పరంగా రికార్డులను తిరగరాస్తోందట. అయితే అంతా ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా ఎదురుచూస్తున్న వైల్డ్ కార్డు ఎంట్రీని బిగ్ బాస్ 8 తెలుగు 2.0 అనే మరొక గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా..ఇంట్లోకి పంపబోతున్నారని తెలుస్తోంది. దసరా స్పెషల్ బొనంజా వీకెండ్ అక్టోబర్ 6న ఈ బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ 2.0 జరగనుందని అంటున్నారు.
బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్స్ జాబితాలో జ్యోతి రాయ్ పేరు చాలా కాలంగా వైరల్ అవుతుంది. గుప్పెడంత మనసు సీరియల్‌లో అమ్మ రోల్‌లో.. పాపులారిటీని సంపాదించుకున్న జ్యోతి రాయ్ ఆ తరువాత మాత్రం సోషల్ మీడియాలోని బోల్డ్ యాంగిల్ బయట పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న జ్యోతి రాయ్ తో పాటు హైపర్ ఆది, రాకింగ్ రాజేష్, యాంకర్ శివ కూడా బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే దసరా ఎపిసోడ్ వచ్చే వరకూ ఆగాల్సిందే.