హయ్యస్ట్ రెమ్యునరేషన్ ఆ కంటెస్టెంట్‏కే..

Highest Remuneration To That Contestant, Highest Remuneration, Contestants, Bigg Boss Highest Remuneration, Aditya Om, Bigg Boss 8 Telugu, Highest Remuneration To Vishnu Priya, Kirak Sita, Naga Manikantha, Nainika, Nikhil, Prithvi Raj, Vishnu Priya, Bigg Boss Telugu Season 8, Bigg Boss 8, Bigg Boss Contestants, Bigg Boss Season 8, Movie News, Latest Bigg Boss News, Bigg Boss News Updates, Nagarjuna, Tollywood, Mango News, Mango News Telugu

బిగ్‏బాస్ సీజన్ 8 మూడో వారంలో జరిగే ఎలిమినేషన్ సమయం దగ్గరకు వచ్చేసింది. మరికొన్ని గంటల్లో ఎవరు బయటకు వెళ్లనున్నారనే విషయంపై క్లారిటీ రాబోతోంది. మరోవైపు రెండు రోజులుగా సాగిన ప్రభావతి 2.0 టాస్కు కూడా ముగిసింది.

ఈ టాస్కుతో హౌస్ చీఫ్ గా నిఖిల్ మరోసారి గెలిచాడు . ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లతో మాత్రమే ప్రారంభమయిన ఈ షోలో ఇప్పటివరకు ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు రాగా.. రెండో వారం ఎవరూ ఊహించని విధంగా వీజే శేఖర్ భాషా ఎలిమినేట్ అయ్యాడు.

ఇక ఈ వారం డేంజర్ జోన్ లో పృథ్వీ, అభయ్ చిట్ట చివరి స్థానాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సోషల్ మీడియాలో ఇప్పటివరకూ అందిన నివేదికల ప్రకారం మూడో వారం అభయ్ ఎలిమినేట్ కానున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

మరోవైపు తాజాగా బిగ్‏బాస్ కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ గురించి ఎప్పుడూ జరిగినట్లే ఈ సారి కూడా నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఈ సీజన్‌లో హయ్యస్ట్ పారితోషికం పొందిన కంటెస్టెంట్.. నటుడు ఆదిత్య ఓం అని ఆ మధ్య పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. అయితే అతని కంటే కూడా ఎక్కువగా యాంకర్ విష్ణుప్రియ పారితోషికం ఉందన్న వార్తలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
బిగ్‏బాస్ 8 తెలుగు షోలో హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ విష్ణుప్రియ అని లెక్కలతో సహా బయటకువచ్చాయి. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆమెకు వారానికి 5.5 లక్షలు రూపాయలు అని.. అదనంగా 18% జీఎస్టీతో కలిపి మొత్తం 6.49 లక్షల రూపాయలు వారానికి ఇస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదిత్య ఓంకు కూడా హౌస్ లో ఎక్కువగానే చెల్లించినప్పటికీ వారానికి అతనికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారట.

నిజానికి బిగ్‏బాస్ రియాల్టీ షో కంటే ముందే విష్ణుప్రియ.. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన యాంకర్. అంతేకాదు.. అచ్చ తెలుగమ్మాయి కూడా. దీనికి తోడు సోషల్ మీడియాలో విష్ణు ప్రియాకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సీజన్లో అత్యంత డిమాండ్ ఉన్న కంటెస్టెంట్ విష్ణుప్రియ అని చెప్పేలా ఇప్పటివరకు విష్ణుకు సపోర్ట్ పెరుగుతూనే ఉంది. దీంతో విష్ణుప్రియ టాప్ 5లో ఉండడం పక్కా అని అంటున్నారు.