ఏ భార్యకు ఏ భర్త అయినా ఏం బహుమతిగా ఇస్తాడు. చీరలో నగలో ఇస్తాడు. లేకుంటే నీకు ఇష్టమైంది ఏదైనా కొనుక్కొ అంటూ ఎంతో కొంత నగదు ఆమె చేతికి ఇస్తాడు. ఇదంతా దాదాపుగా అందరు భర్తలు చేసేదే. కానీ దుబాయ్‌లో బిలియనీర్ వ్యాపారవేత్త మాత్రం ఏకంగా ఓ ద్వీపాన్నే కొనేశాడు. అది కూడా ఆమె బికినీ వేసుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు.
దుబాయ్‌కు చెందిన బిలియనీర్, బిజినెస్ మెన్.. జమాల్ అల్ సదాక్ తన భార్య సౌదీ అల్ నదాక్ కోసం ఏకంగా ఒక ద్వీపాన్ని కొనుగోలు చేశాడు. సౌదీ అల్ నదాక్.. ఇటీవల తనకు బీచ్ లో బికీనీ వేసుకుని ఎంజాయ్ చేయాలని ఉందని చెప్పిందంట. ఇంకేముంది..అసలే బిలియనీర్.. ఆపై అందాల భార్య.. ఆమె కోరిక తీర్చక పోతే ఎట్టా అనుకున్నాడో ఏమో అనుకొన్నాడు. మరీ తన భార్య బికీనీ వేసుకుంటే.. చుట్టుపక్కల ఇతరులు ఉంటే అసౌకర్యానికి గురి అవుతుందని కూడా భావించాడు. మరీ తన భార్య బికినీ వేసుకొవాలి.. ఆమెకు ఇబ్బంది కల్గకుడదని ఒక ప్లాన్ వేశాడు. ఏకంగా ఒక ద్వీపం కోంటే ఎలా ఉంటుందని ఆలోచించాడు.
అనుకున్నదే ఆలస్యం చేయకుండా. హిందూ మహాసముద్రంలో ఓ ద్వీపాన్ని కొనుగులు చేశారు. అది కూడా దాదాపు 50 మిలియన్ల డాలర్లతో కొనుగోలు చేశారు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 418 కోట్లు. తన కోసం తన భర్త కొనుగోలు చేసిన ఈ ద్వీపం విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఆనందం పట్టలేక.. తన భర్త చేసిన పనిని ఎక్స్ వేదికగా పంచుకుంది. ఆ ఐలాండ్ వీడియో సైతం వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకుంది. తన మీద ఉన్న భర్త ప్రేమకు .. సౌదీ అల్ నదాక్ పొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ భార్యా భర్తల ఖరీదైన ఈ ప్రేమ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.