దేశంలో మంకీపాక్స్ కేసులు మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న, ప్రాణాంతకమైన ఈ వ్యాధి ఉనికిని నిర్ధారించిన తర్వాత కేరళలో మరో వ్యక్తికి ఈ అంటువ్యాధి సోకినట్లు నిర్ధారించబడింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసులు శుక్రవారంతో మూడుకు చేరుకున్నాయి. ఎర్నాకుళం జిల్లాలో ఈ కేసు వెలుగుచూసినట్లు నిన్న ఆ రాష్ట్ర వైద్య శాఖ ధ్రువీకరించింది.
కేరళ ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో మంకీసాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య శాఖ అధికారులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలో మంకీపాక్స్ ఉన్నట్లు నిర్ధారించారు. వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని, అనుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తేలింది. బాధితుడికి సోకిన ఎంపాక్స్ వైరస్ జాతి ఇంకా వెలుగులోకి రాలేదు. అంతకుముందు సెప్టెంబర్ 18 న, యూఏఈ నుండి ఇటీవల కేరళ మలప్పురం జిల్లాకు వచ్చిన వ్యక్తిలో మంకీఫాక్స్ లక్షణాలు కనిపించాయి దీంతో అతడికి వైద్య పరీక్షలు చేయగా పాజిటీవ్ ‘వచ్చింది. దీంతో కిరళలో తొలి మంకీ పాక్స్ కేను నిర్ధారణంది. తాజాగా రెండో కేసు నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తమైంది.
మంకిపాక్స్ కేసులు నమోదు దృష్ట్యా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. మంకీపాక్స్ మహమ్మారిగా మారుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మంకీ పాక్స్ లక్షణాలతో బాధపడుతున్న వారిని వెంటనే ఐసోలేషన్ చేయాలని సూచించింది. ఇతరులకు వ్యాధి సోకకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రతి హాస్పిటల్లో మంకీపాక్స్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. అంతేకాకుండా దీనిపై ఒక కన్నేసి ఉంచాలని, నివారణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు కూడా జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.