కొద్దిలో కాస్త తటపటాయించినా..ఇప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న బిగ్ బాస్ సీజన్ 8 షో పై జనాలకు రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది. మూడు వారాల నామినేషన్స్ పూర్తి అవడంతో.. నాలుగోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మొన్నటివరకు సీరియస్ టాస్క్లతో ఉన్న బిగ్ బాస్ లో ఇంటి సభ్యులు చిల్ అయ్యేలా కొత్త టాస్క్ లను బిగ్ బాస్ బాగానే తీసుకొస్తున్నాడు.
నిన్న ఎపిసోడ్‌లో సీరియస్ టాస్క్‌లకు చెక్ పెడుతూ.. హౌస్ లోని కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ ఫన్ గేమ్ ఆడించాడు. ఒకరి పాత్రల్లో మరొకరు దూరి మిమిక్రీ చేయాలని చెప్పడంతో..హౌస్‌మేట్స్ దొరికిన ఛాన్స్‌ను బీభత్సంగా వాడుకున్నారు. మరోవైపు హౌస్ లో మరో లవ్ ట్రాక్ మొదలయింద..
చాలా సందర్భాలలో పృథ్వీ, విష్ణుప్రియకు ఒకరంటే ఒకరికి ఇష్టం అని తేలిపోతూనే ఉంది.ఇదే నిజం అనేలా నిన్న టాస్కులో కూడా పృథ్వీ.. విష్ణుకోసం ప్రేమపాట పాడటం.. అది విని ఆమె పరవశించిపోవడం జరిగాయి. చివరకు వారి ఇష్టాన్ని గ్రహించిన సోనియా.. పృథ్విగాడిని చూస్తే భయం వేస్తుంది. వాడు విష్ణు ప్రేమలో పడిపోయాడనిపిస్తుందని అంటుంది.
ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు గానీ అలా అనిపిస్తుందని నిఖిల్‌తో సోనియా చెప్పుకొచ్చింది. అటు విష్ణుప్రియ కూడా.. తన లేడీ గ్యాంగ్‌కు పృథ్వీ అంటే ఇష్టమని ఓపెన్ గా చెప్పి మరీ అతడితోనే ఎంచక్కా ఉంటోంది. దీంతో వీరిద్దరి లవ్ ట్రాక్ హౌస్ లో మొదలైనట్లు కనిపిస్తుంది.
ఇకపోతే బిగ్‌బాస్ రేషన్ టాస్క్ పెట్టి..అందులో భాగంగా తాను వినిపించే శబ్దాలను వరుస క్రమంలో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో శక్తి టీమ్ గెలవగా తమకు కూరగాయలు, పండ్లు, కూల్‌డ్రింక్ తీసుకోవడానికి ఎక్కువ టైమ్ దొరికింది. కాంతారా టీమ్‌కు వాటిని సంపాదించుకోవడానికి తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు.
అలాగే బిగ్ బాస్ మరో టాస్క్ ను కూడా ఇచ్చాడు. ఓ బంగారు గాజును పెట్టి..దాన్ని ఉపయోగించుకుని ఎవరైనా వేరే టీమ్‌లోకి మారొచ్చని చెప్పాడు. నబీల్‌ను లాక్కోవడానికి శక్తి టీమ్.. పృథ్విని లాక్కోవడానికి కాంతారా టీమ్ ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాలకు చెక్ పెట్టి నాగమణికంఠ గోల్డెన్ బ్యాంగిల్ ధరించాడు. మళ్లీ మణికంఠ కాంతారా టీమ్ కు వచ్చేశాడు.దీంతో ఆదిత్య ఆ టీమ్ కు వెళ్లాడు.
మరోవైపు ఇప్పటికే హౌస్ మొత్తానికి సోనియా తన కంట్రోల్ లో పెట్టుకుంటుందంటూ ఇతర కంటెస్టెంట్స్ గోల పెడుతున్న సంగతి తెలిసిందే. యష్మీ చెప్పినట్లే సోనియా గేమ్ కోసం అందరిని వాడుకుంటుందని ఇటు సోషల్ మీడియాలోనూ టాక్ నడుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో సోనియా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి ఎంత వరకూ నిజమో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.