మహిళలు మూడు పదుల వయస్సు దాటితే చాలు..ఈజీగా బరువు పెరిగిపోతూ ఉంటారు. దీంతో పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగితే వెంటనే తేనె, నువ్వులు డైట్ లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇలా నువ్వులు, తేనె కలిపి తీసుకోవడం ద్వారా రోజంతా చురుగ్గా ఉంటారు. ఎంత పనిచేసినా అలసిపోకుండా ఉంటారు.
నువ్వులు తేనె రెండింటిలోనూ ఎన్నో పోషకాలు మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వులు చాలా రుచికరంగా ఉండటమే కాకుండా నువ్వులతో ఎన్నో రకాల వంటలు చేసుకుంటూ ఉంటాం. నువ్వులలో ఐరన్ పొటాషియం మెగ్నీషియం జింక్ కాల్షియం థయామిన్ విటమిన్ -సి విటమిన్- బి, ఒమేగా 6 ఫ్యాటి యాసిడ్స్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉన్న నువ్వులలో తేనెను కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఒక స్పూన్ తేనె 2 స్పూన్ల నువ్వులను కలిపి ఉదయం సమయంలో తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే శరీరానికి తక్షణ శక్తి లభించి నీరసం అలసట వంటివి లేకుండా రోజంతా చురుకుగా ఉత్సాహంగా ఉంటారు. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నువ్వులు, తేనె కలిపి తీసుకోవడం వల్ల.. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు తగ్గేలా చేస్తాయి. తరచూ వేధించే తిమ్మిర్లు, వాపులు కూడా తగ్గిపోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు కూడా తగ్గిపోతాయి.
వెంట్రుకలు ధృడంగా, ఒత్తుగా, ఆరోగ్యంగా మారడమే కాకుండా చుండ్రు సమస్య పోతుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.నువ్వులు, తేనె కలిపి తీసుకోవడం వల్ల మహిళల్లో ఎముకలకు సంబంధించిన నొప్పులను దూరం చేసుకోవచ్చు. దీనివల్ల వెన్ను నొప్పి వంటి సమస్యలు రావు. ఎదిగే పిల్లలకు కూడా తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. వారి శరీరానికి కావలసిన పోషణ సరిగ్గా అందుతుంది.
నువ్వులు తేనె కలిపి తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. అలాగే తినాలనే కోరిక తగ్గుతుంది. దీంతో బరువు తగ్గుతారు. రక్తహీనత సమస్య తగ్గిపోతుంది మెదడు చురుగ్గా పని చేసి జ్ఞాపకశక్తి సమస్యలు లేకుండా చేస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎముకలకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు.