బిగ్‌బాస్ సీజన్ 8 నాలుగో వారాన్ని కంప్లీట్ చేసుకుని విజయవంతంగా ఐదో వారంలోకి ప్రవేశించింది. ఐదో వారం నామినేషన్స్ పూర్తి కాగా.. మొత్తంగా ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. కాగా హౌస్ నుంచి సోనియా వెళ్లిపోవడంతో తన ప్లేస్‌ను యష్మీగౌడ ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు హౌస్‌లో తనకు ఎదురేలేదన్నట్లుగా యష్మీ రెచ్చిపోతోంది. ఆటలోనూ, మాటలో కూడా ఆమె దూకుడు పెంచింది. ఐదు వారాలుగా జరుగుతున్న బిగ్‌బాస్‌లో ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా గెలవని యష్మీ.. తొలిసారిగా ఓ గేమ్ గెలిచేసరికి కాస్త ఓవర్ గానే రియాక్ట్ అవుతోందన్న టాక్ నడుస్తోంది.
కాగా..సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే ఛాలెంజ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ జాగ్రత్తగా నడు.. లేకపోతే పడతావ్ అనే టాస్క్ పెట్టాడు . దీనిలో భాగంగా 8 బాల్స్‌ను సీసాపై నిలబడి బాస్కెట్‌లో వేయాలి. ఎవరైతే ముందుగా వేస్తారో వారు గెలిచినట్లు. అయితే యష్మీని నిఖిల్, పృథ్వీలు గైడ్ చేస్తూ గెలిపించారు. ఈ గేమ్ లో గెలవడంతో సంబరాలు చేసుకున్న యష్మీ.. మరో టాస్క్‌లో ఓడిపోయిన నబీల్ గురించి హేళనగా మాట్లాడింది. గత వారం నబీల్‌ను నాగార్జున ముందు పొగిడిన యష్మీ.. ఇప్పుడు అతని ఆటను తప్పుబట్టడంతో ఆడియన్స్ కూడా కాస్త అయోమయానికి గురయ్యారు.
మరోవైపు హౌస్‌లోకి కొంత మంది కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని నాగార్జున ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్సే వైల్డ్ కార్డ్ ద్వారా మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. వీరిలో టేస్టీ తేజా, గీతూ రాయల్, ముక్కు అవినాష్ వంటి వాళ్ల పేర్లు మెయిన్‌గా వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్మెంట్ మిస్ అయ్యిందన్న వార్తలు వినిపించడంతో.. బిగ్‌బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా మంచి ఫన్ క్రియేట్ చేసేవాళ్లను తీసుకురావడానికి ట్రై చేస్తున్నారట.
ఇటు …నామినేషన్స్ ముగియడంతో ఓటింగ్ లైన్లు కూడా తెరచుకున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్‌లో నబీల్ 26.22 శాతం ఓటింగ్‌తో అందరి కంటే టాప్‌లో కొనసాగుతున్నాడు. బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్‌తో అనుకోకుండా నామినేషన్స్‌లోకి వచ్చిన నిఖిల్ 25.62 శాతం ఓటింగ్‌తో నబీల్‌కు గట్టి పోటీ ఇస్తున్నాడు. మణికంఠ 18.94 శాతం ఓట్లతో టాప్ 3లో ఉన్నాడు. ఇక యాంకర్ విష్ణుప్రియ 14.51 శాతం ఓట్లతో.. ఓటింగ్‌లో బాగా వెనుకబడటం చర్చనీయాంశమైంది.
ఆదిత్య ఓం 9.01 శాతం ఓట్లతో, నైనిక 5.7 శాతం ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి వీరిలో ఒకరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారని అంటున్నారు. అయితే టాస్క్‌లలో ఆదిత్య ఓం రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఇప్పటికే మంగళవారం ఓ టాస్క్‌లో గెలిచి తన ఓటింగ్ను మెరుగుపరచుకునే లక్ష్యంతో ఉన్నాడు.