శాంతించిన కనకం.. రోజురోజుకు దిగి వస్తున్న బంగారం ధరలు

Gold Prices Are Coming Down Day By Day

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా దసరా పండగ శోభతో కళకళలాడుతున్నాయి. అయితే కొద్ది రోజులుగా పరుగుల పందెం పెట్టినట్లుగా ఉన్న బంగారం ధరలు పండుగ ముందు కొంచెం నెమ్మదించడంతో పసిడి ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పండగ వేళ బంగారం ధర దిగి వస్తుండంతో.. గోల్డ్ కొనుగోలు చేసేందుకు మహిళలు షాపులకు క్యూ కడుతున్నారు.

హైదరాబాద్‌లో బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా తగ్గింది. కేవలం 10 రూపాయలు తగ్గి రూ.70,990 రూపాయల వద్ద ఉంది. 24 గ్రాముల మేలిమి బంగారం ధర 77,440 రూపాయల వద్ద ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా ఇదే విధంగా బంగారం ధరలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీలో బంగారం ధరలు..

దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,350 రూపాయలుగా ఉంది. మేలిమి బంగారం ధర 77,100 రూపాయలుగా ఉంది. కాగా వెండి ధర మాత్రం పెరిగింది.నిజానికి గత 10 రోజుల నుంచి వెండి ధర పెరుగుతూనే వస్తోంది. ఢిల్లీలో కిలో వెండి ధర 97 వేలు రూపాయలుగా ఉంది. హైదరాబాద్‌లో లక్ష 3 వేలు రూపాయలుగా ఉంది. అయితే బంగారం, వెండి ధరలు అప్పటికప్పుడు మారుతూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా బంగారం, వెండికి సంబంధించి జీఎస్టీ, స్థానిక పన్నులను బట్టి మారుతూ ఉంటాయని అంటున్నారు.