బిగ్ బాస్ సీజన్-8 అప్ అండ్ డౌన్స్‌తో అలా కంటెన్యూ అవుతుంది. అయితే హౌస్‌లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కంటెంట్ ఇచ్చింది మణికంఠే అంటారు బిగ్ బాస్ లవర్స్. ఒక మనిషిలో ఇన్ని యాంగిల్స్ ఉంటాయా అని ఆశ్చర్యపోయేలా ఒకసారి ఇంటలిజెన్స్ చూపిస్తాడు. మరోసారి కన్నింగ్, మరోసారి లవ్, మరోసారి సింపథీ..ఇలా మల్టిపుల్ క్యారెక్టర్స్ ని చూపిస్తూ ఆడియన్స్ ను కూడా కన్ఫ్యూజన్లో పడేసిన నాగ మణికంఠ ఆదివారం ఎపిసోడ్లో ఎలిమినేషన్ అయి బయటకొచ్చేశాడు.
కొందర్నిచూస్తే వాళ్ళేంటో అర్థమవుతుంది కానీ ఎవరికి అర్థం కానీ క్యారెక్టర్ బిగ్ బాస్ సీజన్-8లో ఎవరైనా ఉన్నారంటే అది నాగ మణికంఠే అని హౌస్ మేట్స్ కూడా అనుకుంటూ ఉంటారు. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక తనదైన శైలిలో ఆడుతూ టఫ్ ఫైట్ ఇచ్చాడు మణికంఠ.
బయట ఓటింగ్ కూడా చాలా గట్టిగానే పడింది. అయితే ప్రతీవారం నామినేషన్ లో ఉంటూ వచ్చిన మణికంఠ అత్యధిక ఓటింగ్ తో టాప్ లో ఉండటం చూసి బిగ్ బాస్ టీమ్ కూడా షాక్ అయ్యేదట.అలాగే ఈ వారం కూడా అతను టాప్ లోనే ఉన్నాడు . అయితే అతనికి ఆడాలని ఉన్నా, హెల్త్ సపోర్ట్ చేయడం లేదని..ఇకపై బిగ్ బాస్ ఇంట్లో ఉండలేనని చెప్పేసాడు మణికంఠ.
ఇక ఏడో వారం నామినేషన్లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ అవుతూ.. చివరగా నాగ మణికంఠ, గౌతమ్ మిగిలారు. ఎలిమినేషన్ ముందు నాగార్జున హౌస్ మేట్స్ ఒపీనియన్ కూడా తీసుకున్నాడు. అందరూ మణికంఠ వెళ్తేనే బాగుంటుందని అన్నారు. అదే విషయం చెప్తూ మణికంఠని కూడా తన ఒపినీయన్ అడుగగా.. తాను బిగ్ బాస్ హౌస్ లో ఉండను సర్ అని చెప్పేస్తాడు.
తన వల్ల అవ్వడం లేదంటూ మణికంఠ చెప్పడంతో మణికంఠ ఈజ్ ఎలిమినేషన్ అని నాగార్జున చెప్పేశాడు. నిజానికి గౌతమ్ ఎలిమినేషన్ అవ్వాలని.. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం గౌతమ్ ఈజ్ ఎలిమినేటెట్ అని నాగార్జున చెప్పాడు.
ఇక బిగ్ బాస్ హౌస్ లోని హౌస్ మేట్స్ అందరికి బై బై చెప్పేసి.. స్టేజ్ మీదకి వచ్చిన మణికంఠ తన ప్రాబ్లమ్ ఏంటో చెప్పుకున్నాడు.
హౌస్ లో ఎవరుండాలి.. ఎవరు మారాలంటూ.. నాగ్ ఓ షిప్ తీసుకొచ్చి ఎవరిని ముంచేస్తావ్.. ఎవరని షిప్ ఎక్కిస్తావ్ అని అడిగాడు. దీంతో గౌతమ్, పృథ్వీ, నిఖిల్, టేస్టీ తేజని మణికంఠ ముంచేశాడు . విష్ణుప్రియ, హరితేజ, నయని పావని, నబీల్, అవినాష్, రోహిణి, మెహబూబ్‌లని షిప్ మీద పెట్టాడు. ఇలా ఒక్కొక్కరి గురించి చెబుతూ.. మణికంఠ ఎమోషనల్ అయ్యాడు.