మన శరీరానికి ఇతర పోషకాలు, విటమిన్లు, ఎంత అవసరమో… మాంగనీస్ కూడా అలాగే అవసరం. పోషకాలు తగ్గితే… ఆటోమేటిక్గా అనారోగ్యాలు వస్తాయి. దీర్ఘకాలంగా పోషకాలు లేకపోతే… తీవ్రమైన అనారోగ్యాలు ఏర్పడతాయి. చాలా మందికి మాంగనీస్ ఏ ఆహార పదార్థాల్లో ఉంటుందో తెలియదు. అందువల్ల మాంగనీస్ లోపంతో బాధపడుతూ ఉంటారు.
గాయాలు మానాలన్నా, వైరస్లు, బ్యాక్టీరియా బాడీలోకి రాకూడదన్నా, ఎముకలు బలంగా ఉండాలన్నా, మెటబాలిజంలో మార్పులు రాకుండా ఉండాలన్నా.. మనకు మాంగనీస్ తప్పనిసరి. మాంగనీసు తగినంత లేకపోతే… పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతాయి. అధిక బరువు పెరుగుతారు. పిల్లల్లో పెరుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా మూర్ఛ రాకుండా ఉండాలంటే… మాంగనీస్ ఉండే ఆహారం తినాలి.
సైంటిఫిక్ అధ్యయనం ప్రకారం పెద్దవాళ్లకు రోజుకు 2.3 మిల్లీగ్రాముల మాంగనీస్ అవసరం. అంటే పది రోజులకు 23 మిల్లీ గ్రాములు కావాలి. మహిళలు ప్రతి రోజూ 1.8 మిల్లీ గ్రాముల మాంగనీస్ తీసుకోవాలి. మాంగనీసు ఉండే ఆహారం తింటే బాడీకి చలవ చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. క్యాన్సర్ లాంటి రోగాలు కూడా తగ్గుతాయి. రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ సరిగ్గా ఉండాలంటే మాంగనీస్ ఉండే ఆహారం తినాలి.
క్యాబేజీ మనం తరచూ వాడతాం. కానీ కొంత మంది అస్సలు ఇష్టపడరు. అయితే ఇందులో మాంగనీస్ బాగా ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పక వాడాలి. ఇది హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. వారానికి కనీసం 2 సార్లైనా క్యాబేజీని కూరల్లో చేర్చుకోండి.
పైనాపిల్ రుచికరంగా ఉండటమే కాదు… మాంగనీసును లోపల దాచుకుంటుంది కూడా. మాంగనీస్ లోపం ఉన్నవారు… వారానికి 3 లేదా 4 సార్లు పైనాపిల్ తినాలని డాక్టర్లు చెబుతున్నారు.
వెల్లుల్లి మనం దాదాపు రోజూ వాడతాం. ఐతే… కొంత మంది దీని వాసన బాలేదంటూ అస్సలు వాడరు. వెల్లుల్లి నోటికి చేదుగా ఉన్నా… శరీరానికి చేసే మేలు చాలా చాలా ఎక్కువ. మాంగనీస్ లోపం ఉన్న వారు తేనె, వెల్లుల్లిని కలిపి తింటే మంచి ఫలితం ఉంటుంది.
క్యారెట్లు కూడా మాంగనీసుతో నిండి ఉంటాయి. కొంత మంది క్యారెట్ జ్యూస్ తాగుతారు. వాళ్లకు మాంగనీస్ బాగా లభిస్తుంది. పైవి ఏవీ తినని వాళ్లు కనీసం క్యారెట్లైనా తినాలి. వీటిలో మాంగనీసు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇవి బాడీకి రోగాలను దూరంగా ఉంచుతాయి.
అరటి పండ్లను భారతీయులు ఎక్కువగా తింటారు. అందువల్లే మాంగనీస్ లోపం దాదాపు ఉండదు. కొంత మంది వీటిని తింటే లావు అవుతామనే ఆలోచనతో వీటిని తినరు. కానీ అరటిపండులో ఉన్నంత మాంగనీస్.. పై వేటిలోనూ ఉండదు. కాబట్టి మూర్ఛ, నీరసం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు వీలైనంతగా అరటిపండ్లను తినాలి. దీనిద్వారా మాంగనీస్ లోపం పోతుంది.