గూగుల్ కు భారీ జరిమానా విధించిన రష్యా..

Russian Court Has Slapped A 20 Decillion Fine On Google, Russian Court Has Slapped A 20 Decillion, 20 Decillion Fine On Google, Fine On Google, Russian Court Fine On Google, Court Of Moscow, Russia, Russia Fines Google, World GDP Is 105 Trillion Dollars, Russian Court Has Slapped, 20 Decillion Fine, Russia, Russia Live Updates, Russia News, Live News, Headlines,Breaking News, Mango News, Mango News Telugu

టెక్ దిగ్గజం గూగుల్ కు రష్యాలోని మాస్కో కోర్టు భారీ జరిమానా విధించింది. తమ దేశ స్థానిక టీవీ నెట్‌వర్క్‌లకు చెందిన 17 యూట్యూబ్ ఛానెల్‌లను బ్లాక్ చేసినందుకు రష్యా కోర్టు గూగుల్‌పై $20 డెసిలియన్ జరిమానా విధించింది. అంటే భూమిపై చలామణీలో ఉన్న నగదు కంటే ఎక్కువన్న మాట. ఒక ఆన్లైడెసిలియన్ అంటే 1 తర్వాత 36 సున్నాలు ఉంటాయి. ఇది ప్రపంచ జీడీపీ 105 ట్రిలియన్ డాలర్లు కంటే ఎక్కువ. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమ్మీద చలామణిలో ఉన్న మొత్తం సొమ్ము కంటే ఇది చాలా ఎక్కువ. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ మొత్తం మార్కెట్ విలువ కూడా 2 ట్రిలియన్ డాలర్లకు మించదు. ఈ లెక్కన ఈ మొత్తం జరిమానాగా చెల్లించడం గూగుల్‌కే కాదు.. ఈ భూమ్మీదున్న మరే సంస్థకు సాధ్యం కాదు.

వచ్చే తొమ్మిది నెలల్లోగా $20 డెసిలియన్ జరిమానా చెల్లించడంలో Google విఫలమైతే, ఆ తర్వాత ఆ మొత్తం ప్రతిరోజూ రెట్టింపు అవుతుంది. గూగుల్ 2022లో తమ రష్యన్ యూనిట్‌ను మూసివేసింది.. అప్పట్లో కూడా $100 మిలియన్ల జరమానాకు సంబందించి ఆస్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత దివాలా తీసినట్లు ప్రకటించింది.

2020 నుంచి ఇప్పటివరకు క్రెమ్లిన్ అనుకూల, రష్యా ప్రభుత్వ అధికార మీడియా సహా 17 ఛానల్స్న యూట్యూబ్ నిలిపివేసింది. ఈ ఛానల్స్న పునరుద్ధరించాలని మాస్కో కోర్టు ఆదేశించినా గూగుల్ నిరాకరించింది. దీంతో గూగుల్కు మాస్కో కోర్టు అతి భారీ జరిమానా విధించింది. ప్రపంచ జీడీపీ 100 ట్రిలియన్ డాలర్ల కంటే కూడా ఇది అధికం. అంత పెద్ద మొత్తంలో పైన్ కట్టడం గూగుల్కు దాదాపు సాధ్యం కాకపోవచ్చు. రష్యన్ కోర్టులు ఇచ్చే తీర్పుల ప్రభావం తమపై పడకుండా గూగుల్ గతంలోనే జాగ్రత్తపడింది. రష్యన్ టీవీ ఛానళ్ల యజమానులకు వ్యతిరేకంగా అమెరికా, బ్రిటన్ కోర్టుల్లో వ్యాజ్యాలను దాఖలు చేసింది.