బిగ్‌బాస్‌ నుంచి క్రై బేబీ ఎలిమినేట్.. ఊపిరి పీల్చుకున్న ఆడియన్స్

Cry Baby Eliminated From Bigg Boss

మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ 8 రియాల్టీషో ఇప్పుడు పదో వారంలోకి అడుగు పెట్టింది. ఈ 9 వారాల్లో 10 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, ఆదిత్య ఓం, సోనియా ఆకుల, నైనిక, కిర్రాక్ సీత, మణికంఠ, మెహబూబ్ దిల్ సే ఇప్పటి వరకూ ఎలిమినేట్ కాగా.. రీసెంట్ గా క్రై బేబీగా స్టాంప్ వేసుకున్న నయని పావని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.

నిజానికి గత వారమే నయని ఎలిమినేట్ అవ్వాల్సింది. అయితే త్రుటితో తప్పించుకుంది నయని . నయని స్థానంలో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. కానీ ఈ వారం ఎలిమినేషన్ నుంచి మాత్రం నయని తప్పించుకోలేకపోయింది. నయని గత సీజన్‌లో కూడా నయని పావని వైల్డ్‌కార్డ్‌ కంటెస్టెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది.

అప్పుడు కేవలం ఒక వారం మాత్రమే ఉండి ఎలిమినేట్ అయ్యింది. దీంతో నయనిపై సింపతీ బాగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగానే ఈ సీజన్‌లో ఎలాగైనా తనను తాను నిరూపించుకుంటా అంటూ మళ్లీ హౌస్ లోకి అడుగు పెట్టింది. ప్రారంభంలో ఆటపై బాగానే దృష్టి పెట్టిన నయని.. తన మాటతీరుతో, గేమ్స్ తో ఆడియెన్స్ ను బాగానే ఎంటర్ టైన్ చేసింది.

అయితే మెల్లమెల్లగా నయని ఆట మారిపోయింది. ప్రతి చిన్న విషయానికి గొడవ పడటమే కాకుండా..చీటికి మాటికి ఏడవడం ఆమెకు మైనస్‌గా మారింది. టాస్కుల్లో కూడా నయని తన మార్కు ఆటను చూపించలేకపోయింది. దీనికి తోడు అనవసర గొడవల్లో తలదూర్చుతుందన్న చెడ్డ పేరు ఒకటి బాగా తెచ్చుకుంది. దీంతో ఎంత త్వరగా హౌస్ నుంచి పంపేద్దామా అని బిగ్ బాస్ ఆడియెన్స్ ఎదురుచూసారు. అవకాశం రాగానే తక్కువ ఓట్లు వేసి నయనిని బయటకు పంపించారు.