సోమవారం బిగ్ బాస్ హౌస్ లో మొదలైన నామినేషన్స్ ప్రక్రియ, మంగళవారం వరకు కొనసాగింది. ఈ ప్రక్రియలో ఎలిమినేట్ అయిన పాత కంటెస్టెంట్స్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి ఉన్న టాప్ 10 కంటెస్టెంట్స్ లో.. 5 మందిని నామినేట్ చేసి వెళ్లారు. సోమవారం ఎపిసోడ్ లో సోనియా, బెజవాడ బేబక్క, శేఖర్ బాషా రాగా, మంగళవారం ఎపిసోడ్ లో నైనికా, సీత, ఆదిత్య ఓం, నాగ మణికంఠ హౌస్ లోకి వచ్చారు.
వీరిలో సీత నామినేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. సీత యష్మీ,ప్రేరణని నామినేట్ చేసింది. ఇద్దరినీ మంచి పాయింట్స్ తోనే నామినేట్ చేసినా..యష్మీ విషయంలో నిఖిల్ గురించి ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యాయి.
సీత యష్మీ ని నామినేట్ చేస్తూ ..మొదట్లో ఉన్న యష్మీ, ఇప్పుడు తనకు కనిపించడం లేదని అంటుంది. యష్మీ.. నిఖిల్ ట్రాప్ లో పడినట్లు తనకు అనిపించిందని అంటుంది. ఇప్పుడు యష్మీ గురించి ఏమైనా చూద్దాం అనుకుంటే, ఆమెతో పాటు నిఖిల్ ని కూడా చూడాల్సి వస్తుందని.. అంతలా అతనికి దాసోహం అయిందని కామెంట్ చేస్తుంది. అతనికి యష్మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని.. దయచేసి అర్థం చేసుకొని యష్మీ గేమ్ యష్మీని ఆడమని సలహా ఇస్తుంది.
సీత మాటలతో నిఖిల్ వెంటనే కలగచేసుకొని ట్రాప్ లో పడేయడం ఏమిటని అడుగుతాడు. అప్పుడు సీత దానికి ..మగవాళ్లతో సమానంగా గేమ్స్ ఆడే స్ట్రాంగ్ అమ్మాయిలను ట్రాప్ లో పడేసి, వాళ్ళ గేమ్ ని డౌన్ చేసి, వాళ్ళని బలహీనపరుస్తున్నావని అంటుంది. సోనియా నుంచి యష్మీ వరకు అదే చేసావని.. దాని వల్ల నీ గేమ్ పై ఎలాంటి ప్రభావం పడలేదు, యష్మీ గేమ్ నాశనం అయ్యిందని సమాధానమిస్తుంది.
దీనికి నిఖిల్..ఇది చాలా తప్పు మాటలని.. ఒకరిని ప్రభావితం చేస్తే, ప్రభావితులయ్యే అమాయకమైన అమ్మాయిలు ఇక్కడ ఎవ్వరూ లేరని అంటాడు. తాను దీనిని తీసుకోలేనని అంటాడు. అయితే నామినేషన్ అయిపోయిన తర్వాత కూడా నిఖిల్ సీత మాట్లాడిన మాటలనే తల్చుకుంటూ బాధపడతాడు. అమ్మతోడు, సీతని బయటకి వెళ్లాక అసలు క్షమించనని అంటాడు.
తానెప్పుడు అమ్మాయిలను ట్రాప్ లో పడేసానని నిఖిల్ పృథ్వీతో అంటాడు. యష్మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకొని, ఆమెని దూరం పెడితే, దానికి యష్మీ బాధపడి కనీసం తనను స్నేహితురాలిగా అయినా చూడు అంటేనే కదరా ఆమెతో బాగున్నాను. ఇది సీతకి కనిపించలేదా? అని అడుగుతాడు. అంత పెద్ద మాట ఎలా అనిందంటూ బాధపడతాడు.
సీత మాటలకు అన్నం కూడా తినకుండా నిఖిల్ అలాగే పడుకుంటాడు. అంతేకాదు హౌస్ లో ఉన్న కెమెరాలతో తాను ఈ నిందని తీసుకోలేకపోతున్నానని.. తనను పంపించేయండి బిగ్ బాస్ అని నిఖిల్ అంటాడు. ఇది చూసిన పృథ్వీ అతనికి సర్దిచెప్పి, హౌస్ లో ఉండిపొమ్మని అంటాడు. అటు యష్మీ కూడా సీత చేసిన కామెంట్స్ ని విబేధిస్తూ.. తనతో నిఖిల్ ఎప్పుడూ అలా ప్రవర్తించలేదని చెప్పింది.