కొన్నిసార్లు ఉదయం లేచిన దగ్గర నుంచి మనసు బాగోదు. ఏదో దిగులు కమ్ముకున్నట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు చిన్నచిన్న విషయాలకు కూడా ఎక్కువ ఆలోచించి మూడ్ పాడు చేసుకుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని ఆహారాలు తీసుకోడం వల్ల మూడ్ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.ఆ ఫుడ్స్ లో ఉండే పోషకాలు చురుగ్గా అవ్వడానికి, మూడ్‌ను మార్చేయడానికి ఇవి సహకరిస్తాయి.
డార్క్ చాక్లెట్ మీ మూడ్ మార్చడంలో ఫస్ట్ ప్లేసులో ఉంటుంది. దీనిలో ఫ్లేవనాయిడ్స్, పోలిఫెనోల్స్ పుష్కలంగా ఉండటంతో.. ఇది తింటే శరీరంలో సెరటోనిన్ పెరుగుతుంది. ఎందుకంటే ఒత్తిడి, ఆందోళన తగ్గేలా ఈ సెలటోనిన్ చేయగలదు. డార్క్ చాక్లెట్ తినడానికి చాలా మంది ఇష్టపడతారు. మరీ చేదుగా ఉందని అన్పిస్తే… నేరుగా కాకుండా ఓట్స్, పాలు, కాఫీలోనూ కలిపి తీసుకోవచ్చు.
నట్స్ కూడా మూడ్ మార్చడంలో సహాయపడతాయి. బాదంపప్పు, వాల్‍నట్స్, జీడిపప్పు వంటి నట్స్ తో పాటు, గుమ్మడి, పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే మూడ్ హ్యాపీగా మారే అవకాశం ఉంటుంది. వీటిలో ఎక్కువ మోతాదులో ఉండే అమినో యాసిడ్స్ సెరటోటిన్‍ను పెంచుతుంది. అందుకే మూడ్ మారడానికి నట్స్, విత్తనాలు తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వీటిలోని కీలకమైన విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాబట్టి రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితాలుంటాయి.
అరటి పండ్లలో విటమిన్ బి 6 పుష్కలంగా ఉంటుంది. బనానాలో ఫీల్‍గుడ్ హార్మోన్ డొపమైన్‍తో పాటు సెరటోనిన్ ఉత్పత్తిని పెంచే శక్తి ఉండటంతో.. సంతోషంగా అనిపించి మూడ్ మారుతుంది. అలాగే అరటి పండ్లలో ఫైబర్ కూడా మెండుగా ఉండటంతో.. కడుపులో కూడా హాయిగా అనిపిస్తుంది.
ఓట్స్‌లో డయెటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటంతో.. ఉదయాన్నే ఓట్స్‌తో చేసిన ఫుడ్స్ తింటే శరీరంలో ఎనర్జీ బాగా పెరుగుతుంది. దీనివల్ల నీరసం,బద్దకం వంటివి తగ్గుతాయి. శరీరం చురుగ్గా అవ్వడానికి ఓట్స్ తోడ్పడతాయి. ఓట్స్ తినడం వల్ల మూడ్ బాగా మారిపోతుంది కాబట్టి.. హ్యాపీ ఫీలింగ్‍ను ఇస్తుంది.
అంతేకాదు సాల్మోన్, టునా వంటి ఫ్యాటీ చేపుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆందోళన స్థాయిని తగ్గించి.. శరీరం ప్రశాంతంగా ఫీల్ అయ్యేలా చేయగలవు. అందుకే మనసు బాగోలేనప్పుడు ఇలాంటి చేపలు తిన్నా కూడా మూడ్ మారుతుంది.
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ వంటి బెర్రీ పండ్లలో ఫ్లేవనాయిడ్స్, యాంథోసియానిస్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ కూడా ఎక్కువగా ఉండటంతో.. శరీరంలో ఒత్తిడిని తగ్గిస్తాయి. బెర్రీలు ఆందోళనను తగ్గించేలా చేయగలవు. అందుకే హ్యాపీ మూడ్ కోసం బెర్రీలు తిన్నా ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.