సీజనల్ ప్రూట్ అయిన సపోటా పండును చాలామంది ఇష్టపడతారు. అయితే ఆ పండ్లు స్వీట్ నెస్ ఎక్కువగా ఉండటంతో చాలా మంది షుగర్ వస్తుందని.. మధుమేహం పెరిగిపోతుందని మరికొంతమంది దానిని తీసుకోవడానికి భయపడతారు. ఏడాదికి ఒకసారి దొరికే ఈ పండు పొట్ట, నడుము వద్ద పేరుకుపోయిన మొండి కొవ్వును కూడా కరిగిస్తుందని చాలామందికి తెలీదు. అంతేకాదు ఇది క్యాన్సర్‌ని కూడా తగ్గించే శక్తివంతమైన పండు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిజానికి సపోటా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. సపోడా పండు స్పెయిన్ దేశానికి చెందినదని చరిత్ర చెబుతుంది. స్పెయిన్ నుంచి ప్రయాణించే నావికులు ఈ పండు విత్తనాలను భారతదేశానికి తీసుకువచ్చి ఇక్కడ పెంచడం వల్ల ఇండియాలోనూ ఈ మొక్కలు విస్తారంగా పెరగడం మొదలయ్యాయని అంటారు.
సపోటాపండులో చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఈ పండ్లలోని విటమిన్ ఎ,విటమిన్ సి కంటికి మేలు చేస్తాయి. అందుకే రోగనిరోధక శక్తిని పెంచడంతో సపోట ది బెస్ట్ ఫ్రూట్ అంటారు వైద్యులు. శరీరంలోని వ్యర్థాలను తొలగించి గుండెను రక్షించడంలో సపోటా మేలు చేస్తుంది. సపోటాలలో సుక్రోజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ పండు తక్షణ శక్తిని ఇస్తుంది. పని చేసి అలసిపోయిన వాళ్లు ఒక సపోటాను తింటే చాలు ఫుల్ ఎనర్జీ వస్తుంది.
సపోటా మలబద్ధకం సమస్య దూరం చేస్తుంది.ఈ పండు కడుపు సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాదు సపోటాలో ఫైబర్, విటమిన్ బితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో… ఇవి క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులను నివారిస్తాయి.
సపోటాలలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. రోజూ సపోటా తింటే వృద్ధాప్యంలో ఎక్కువ మందులను వాడాల్సిన పనే ఉండదు. సపోటాలో ఫోలేట్, క్యాల్షియం, జింక్, కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం,సెలీనియం ఎముకలను దృఢపరచడానికి పనికి వస్తుంది..గర్భిణీలు ఉదయాన్నే సపోటా పండు తింటే చాలా మంచిది. కడుపులోని బిడ్డకు కొల్లాజెన్‌ను తగినంత ఉత్పత్తి చేస్తుంది.