గేమ్ ఛేంజర్.. రికార్డు సృష్టించిన రామ్ చరణ్ ఫ్యాన్స్: 256 అడుగుల కటౌట్..

Game Changer Fever Ram Charan Fans Erect 256 Foot Cutout For A Guinness Record, Game Changer Fever, Ram Charan Fans Erect 256 Foot Cutout, Ram Charan 256 Foot Cutout For A Guinness Record, Guinness Record, Game Changer Promotions, Guinness World Record, Ram Charan Cutout, Telugu Cinema Milestone, Vijayawada Event, Game Changer, Ram Charan, Shankar, Upcoming Movie Release, Game Changer Telugu Movie, Game Changer, Tollywood, Tollywood News, Tollywood Latest News, Tollywood Updates, Live Updates, Breaking News, Headlines, Live News, Mango News, Mango News Telugu

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 10, 2025న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది.

ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ రామ్ చరణ్ అభిమానులు విజయవాడలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. వజ్రా మైదానంలో 256 అడుగుల ఎత్తైన రామ్ చరణ్ కటౌట్‌ను నిర్మించి, ఇది దేశంలోనే అతి పెద్ద కటౌట్‌గా నిలవాలని గిన్నిస్ బుక్ రికార్డు కోసం ప్రతిపాదించారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్ నిర్మాణం అయిదు రోజుల పాటు కొనసాగగా, చెన్నై నుండి ప్రత్యేక బృందం సహకరించింది.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కటౌట్‌ను చిత్ర యూనిట్‌తో కలిసి ఆవిష్కరించనున్నారు. హెలికాప్టర్ ద్వారా పూలభిషేకం చేయడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్, మరియు ఇతర చిత్రబృందం హాజరుకానుంది.

గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణి నటించగా, అంజలి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన “జరగండి,” “రా మచ్చా మచ్చా,” “నా నా హైరానా,” “ధోప్” పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ వేగంగా జరుగుతుండగా, ఫ్యాన్స్ ఈ మెగా ప్రాజెక్ట్‌ను ఘనవిజయం చేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు.