మెంతులతో ఎంత మేలుందో తెలుసా?

Do You Know How Good Fenugreek Is, Advantages Fenugreek, Benefits Of Fenugreek, Fenugreek Health Benefits, Fenugreek, Hair Loss, Health, Black Hair, Black Tea, Mehndi, White Hair, Dandruff, Experts, Hair Loss, Hair Loss Tips, Effects Of Hair Loss, Home Remedies for Dry Hair, Tips For Black Hair, Black Hair Tips, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

మెంతులు వంటల్లో రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తాయి. మెంతి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటంతో..ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు మెంతి గింజలు చర్మం, జుట్టుకు పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రతి రోజు మెంతి నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

ఒక కడాయిలో మెంతి గింజలను సన్నని మంటపై వేయించి.. తర్వాత ఈ మెంతులను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీస్పూన్ మెంతి పొడి వేసి కలపాలి. ప్రతిరోజు ఉదయం ఈ వాటర్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.

మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ మెంతి నీళ్లను తాగితే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఏమీ తినడానికి ఇష్టపడరు. దీనివల్ల ఈ నీళ్లు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అంతేకాదు ఇది ఉబ్బరం నివారించడానికి సహాయపడుతుంది.

మెంతుల్లో జుట్టు పెరుగుదలకు సహాయపడే పోషకాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి, దృఢంగా అవడానికి, చుండ్రు సమస్యలను నివారించడానికి బాగా పనిచేస్తుంది.

మెంతుల పొడిని హెన్నా పొడిలో కలిపి జుట్టుకు అప్లై చేసి అరగంట ఆగాక తలకు స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పెరుగులో మెంతులు నానబెట్టి ఆ ఫేస్ట్ ను తలకు అప్లై చేసినా కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

మెంతులు షుగర్ పేషెంట్స్ కి గొప్ప ఔషధం అంటారు నిపుణులు. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో మెంతులు దోహదపడతాయని చెబుతున్నారు. మెంతి గింజల్లో అమైనో ఆమ్లాలు ఉండటంతో.. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి.

మెంతులు మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బాగా సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. మెంతుల వినియోగం మూత్రపిండాలలోని ఉన్న రాళ్ల చికిత్సకు కూడా సహాయపడుతుంది.

మెంతి నీళ్లు శరీరంలో ఉన్న హానికరమైన విష పదార్థాలను బయటకు పంపుతాయి. ఇది జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మలబద్దకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది.