70 గంటలు? 90 గంటలు? అసలు విషయం పని గంటలు కాదు, పనిలో నాణ్యతే ముఖ్యం: ఆనంద్ మహీంద్రా”

70 Hours Or 90 Anand Mahindra Says Its Not About Hours Its About Quality Of Work,Anand Mahindra,Corporate Leadership,Productivity Debate,Quality Over Quantity,Work Life Balance,Mango News,Mango News Telugu,Anand Mahindra News,Anand Mahindra Latest News,Anand Mahindra Tweet,Anand Mahindra Latest Post,Quality Of Work,Anand Mahindra On 90-hour Work Week Debate,90-hour Work Week Debate,Anand Mahindra Reply To 90-hour Work Week Debate,Anand Mahindra On L&T Boss,N Murthy's Work Week Comments,SN Subrahmanyan,L&T Chairman,90 Hours Work Week,Work Life Balance,Larsen Toubro,Subrahmanyan,Narayan Murthy,Anand Mahindra Responds To 90-hour Work Week Debate,Anand Mahindra Reacts To 90-hour Work Week Debate

ఇటీవల పని గంటలపై పలువురు ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్ సహస్థాపకుడు నారాయణ మూర్తి వారానికి 70 గంటల పని అవసరమని వ్యాఖ్యానించిన తరువాత, ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి. తాజాగా, ఈ అంశంపై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2025 సదస్సులో ఆయన చేసిన వ్యాఖ్యలు పని గంటలపై కొత్త దృక్పథాన్ని అందించాయి.

పని గంటలు కాదు, పనిలో నాణ్యత ముఖ్యం
ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ, “నా ఉద్దేశం ఏమిటంటే, మనం పని నాణ్యతపై దృష్టి పెట్టాలి, పని గంటలపై కాదు. ఇది 40 గంటలు, 70 గంటలు లేదా 90 గంటలు కాదు. మీరు 10 గంటల్లోనైనా ప్రపంచాన్ని మార్చగలరు,” అని పేర్కొన్నారు. పని అవుట్‌పుట్‌నే అసలు మీపద్దతిగా అనుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

సుబ్రహ్మణ్యన్, నారాయణ మూర్తి వ్యాఖ్యలపై
ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్, నారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపై అభిప్రాయాన్ని తెలియజేస్తూ, “నారాయణ మూర్తి గారన్నా, సుబ్రహ్మణ్యన్ గారన్నా నాకు చాలా గౌరవం ఉంది. కానీ, పని సమయానికి బదులుగా పనిలో నాణ్యతే ముఖ్యం అని నా అభిప్రాయం,” అన్నారు.

సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ప్రముఖ నటి దీపికా పదుకొనె, వ్యాపారవేత్త హర్ష గోయెంక వంటి ప్రముఖులు కూడా స్పందించారు. మానసిక ఆరోగ్యం, పని సమతుల్యత కూడా అవసరమేనని వారు పేర్కొన్నారు. “ప్రతి ఉద్యోగి తన పనిలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు కృషి చేయాలి. టైమ్ షీట్ మీద 70 గంటల సమయం లేదు, 90 గంటల సమయం లేదు. పని నాణ్యతే మేలైన పని,” అని ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.

తాను యువతతో మాట్లాడితే ఎనర్జీని రిఫ్రెష్ చేసుకుంటానని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. “యువతరం ప్రతినిధులతో చర్చించడం ద్వారా నా ఉత్సాహం పెరుగుతుంది,” అన్నారు.