పచ్చి బొప్పాయి అంటే కేకుల్లోనూ, బ్రెడ్స్ లోనూ కనిపించే ట్రూటీఫ్రూటీలే గుర్తుకు వస్తాయి. అలాగే ప్రెగ్నెన్సీ పోగొట్టుకోవడానికి కూడా కొంతమంది పచ్చి బొప్పాయి తినమని చెబుతూ ఉంటారు. అయితే బొప్పాయి పండ్లే కాదు.. పచ్చి బొప్పాయిలను కూడా తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటితోనూ అద్భుతమైన లాభాలు కలుగుతాయట.
పచ్చి బొప్పాయిలను తినడం వల్ల జీర్ణవ్యవస్థకు చెందిన సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, మలబద్దకం, ఇర్రిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గుతాయి. జీర్ణవ్యవస్థలో ఉండే పురుగులు చనిపోతాయి. పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్, కైమోపపైన్ అనే ఎంజైమ్‌లు సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
పచ్చి బొప్పాయిలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సోడియం వంటి మినరల్స్ అధికంగా ఉంటాయి. పపైన్, కైమోపపెయిన్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తాయి. దీనిలో సహజసిద్ధమైన లేటెక్స్ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరం శుభ్రంగా మారుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
పచ్చి బొప్పాయిలలో బీటా కెరోటీన్, లైకోపీన్ అధికంగా ఉంటాయి. పండు బొప్పాయిల్లో కన్నా అవి పచ్చి బొప్పాయిల్లోనే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది. కంటి సమస్యలు తగ్గుతాయి.
పచ్చి బొప్పాయిలో శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి బొప్పాయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లయిన సాపోనిన్స్, టానిన్స్, బీటా కెరోటిన్, ఫ్లేవనాయిడ్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీర రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి.
అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు పచ్చి బొప్పాయిలను తింటే త్వరగా బరువు తగ్గొచ్చు. గాయాలు, పుండ్లు అయిన వారు దీనిని తింటుంటే అవి త్వరగా మానుతాయి. అంతేకాదు వీటిని తినడం వల్ల బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. ఏదైనా సమస్యతో బాధపడేవారు .. డైరక్ట్ గా తినే బదులు ఒకసారి డాక్టర్ ను కలిసి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
పచ్చి బొప్పాయిలను తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. గుండె ఆరోగ్యకరమైన రీతిలో కొట్టుకుంటుంది. అంతేకాదు వీటిని తింటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పెద్ద పేగు శుభ్రమవుతుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి.