గుడ్డు ఆరోగ్యానికి వెరీ గుడ్డే ..కానీ ..

Eggs Are Very Good For Health But, Eggs Are Very Good, Eggs For Health, Eggs, Eggs Are Very Good For Health, Good For Health, Benefits Of Eggs, Advantages Of Eggs, Health Benefits Of Eggs, Eggs Benefits, Health, Health News, Health Tips, Healthy Food, Healthy Diet, Fitness, Mango News, Mango News Telugu

అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు మాత్రమే అని.. రోజూ ఎగ్ తినండని వైద్యులు చెబుతూ ఉంటారు. గుడ్డులో తొమ్మిది రకాల ప్రోటీన్లు, శరీరానికి అవసరమైన 9 అమైనో ఆమ్లాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. అందుకే గుడ్డు శరీరానికి మల్టీ విటమిన్‌గా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతుంది. గుడ్డులో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఎగ్ లో ప్రోటీన్లు, ఇనుము, విటమిన్లు ఎ, బి 6, బి 12, ఫోలేట్, అమైనో ఆమ్లాలు, భాస్వరం , సెలీనియంలు లభిస్తాయి. ఉడికించిన గుడ్లు ప్రోటీన్, ఇతర పోషకాలకు మంచి మూలం చెప్పవచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఒక్క సి విటమిన్ తప్ప అన్ని విటమిన్లు ఉంటాయి.

గుడ్డును తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. గుడ్డులోని ఐరన్‌ శరీరం వేగంగా గ్రహిస్తుంది. ఐరన్‌ గర్భిణులు, బాలింతలకు ఉపయోగపడుతుంది. మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా కాపాడుతుంది. జట్టు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. గుడ్డులో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి సాయపడతుంది. గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడతాయి. అలానే నరాల బలహీనత ఉన్న వారు రోజూ గుడ్డును తీసుకోవాలి. గుండె జబ్బుల నివారణకు తోడ్పడుతుంది. ఉడకబెట్టిన గుడ్డు వల్ల జీర్ణ సమస్య దూరం అవుతుంది. ప్రొటీన్లు పుష్కలంగా అందుతాయి.

కొంతమంది గుడ్డుని ఉడక బెట్టుకుని తింటే.. మరికొందరు ఆమ్లెట్, కూరలు వంటివి చేసుకుని తింటారు. కొంతమంది గుడ్డులోని తెల్లని సొనని తిని.. పచ్చని సొన పడేస్తుంటారు. ఇంకొందరు ఉడకబెట్టి గుడ్డుని తింటే.. మరికొందరు పచ్చిగా తింటారు. అయితే పచ్చిగా గుడ్డు తీసుకోవడం మంచిదా చెడ్డదా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా అనే సందేహం చాలామందిలో వస్తుంటుంది. కోడి గుడ్డుని పచ్చిగా పగలగొట్టుకుని తాగొచ్చు. అయితే అలా చేసే వాళ్లు ఒక విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి.

కోడిగుడ్లలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. మామూలుగా అయితే కోడిగుడ్డుని ఉడికిస్తే ఆ బ్యాక్టీరియా నశిస్తుంది. కానీ, చాలా మంది మాత్రం పచ్చిగానే పగలకొట్టి తాగుతున్నారు. పచ్చిగా తాగితే ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. కోడిగుడ్డులో ఈ బ్యాక్టీరియా స్వల్ప మోతాదులో ఉంటుంది. అందుకే ఆరోగ్యంగా ఉన్న మనిషికి ఎటువంటి హాని కలగదు. కానీ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇన్‌ఫెక్షన్లు, జ్వరం వస్తాయి. పచ్చి గుడ్డులోని తెల్లటి భాగంలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఇది మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే అనారోగ్యంతో బాధపడే వ్యక్తులు పచ్చి కోడి గుడ్డుని తీసుకోకూడదంటున్నారు నిపుణులు. ఏమైనా వ్యాధులున్న వారు పచ్చి కోడి గుడ్డుని రెగ్యులర్ గా తీసుకుంటే బయోటిన్ అనే పోషక లోపం ఏర్పడుతుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. బయోటిన్ లోపాన్ని విటమిన్ బి 7 అని కూడా అంటారు. ఈ లోపం ఏర్పడితే.. చర్మంపై దురదలు, వెంట్రుకలు రాలిపోవడం, నరాల బలహీనత వంటి సమస్యలు ఏర్పడతాయి.

కొంతమందికి పచ్చి గుడ్డులోని తెల్లసొన అలర్జీని కలిగించే అవకాశం ఉంది. శరీరంలో దద్దుర్లు, వాపు, చర్మం ఎర్రబడటం, తిమ్మిరి, విరేచనాలు, దురద, కంటిలో నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అంతేకాదు గుడ్డులోని తెల్లసొన కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది. బీపీలో హెచ్చుతగ్గులు కూడా ఏర్పడతాయి. అందుకే వీలయినంతగా పచ్చి గుడ్లను తినకుండా మిగిలిన రూపాల్లో తింటే మంచి ఫలితాలు పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.