భారీ రేంజ్లో విశ్వంభర మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

చిరంజీవి కొన్నాళ్లుగా యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అందుకే తన విశ్వంభర మూవీ కోసం.. బింబిసార సినిమాతో మంచి విజయాన్ని దక్కించుకున్న డైరక్టర్ వశిష్టను ఎంచుకున్నారు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే భారీ రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ ని జరుపుకుంటుందనే న్యూస్ బీ టౌన్లో వినిపిస్తుంది.

నిజిానికి ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవికి చాలా ముఖ్యం. ఈ ఏడాది స్టార్టింగ్ లోనే బాలయ్య బాబు డాకు మహారాజ్ సినిమాతో మంచి విజయాన్ని సాధించగా..వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. దీనికితోడు సైరా తర్వాత చిరంజీవికి పెద్దగా చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. దీంతో చిరు ఈ సినిమాను దగ్గరుండి మరి తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.

వశిష్ట లాంటి డైరక్టర్ మెగాస్టార్ తో చేస్తున్న భారీ గ్రాఫికల్ మూవీ కావడంతో.. యావత్ ఇండియన్ సినిమా ఆడియన్స్ కు భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే తెరకెక్కిస్తున్నారా? చిరంజీవి మరోసారి తన సత్తా చాటబోతున్నాడా? అంటూ మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో..మెగాస్టార్ మెగా హిట్ కొట్టాలంటే ఈ సినిమా భారీ రేంజ్ లో ఎలివేట్ అవ్వాలి. మరి ఈ మూవీపై రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ బజ్ అదే రేంజ్లో పెరుగుతుంది. దీనికి తగినట్లే ఈ సినిమాకి బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరగబోతున్నట్లుగా తెలుస్తోంది.