పండుగ పూటా భారీగా పెరిగిన గోల్డ్ , సిల్వర్ ధరలు

బులియన్ మార్కెట్‌లో గోల్డ్ , సిల్వర్ ధరలు పరుగులు పెడుతున్నాయి. గత కొంతకాలం నుంచి తగ్గేదేలా అన్నట్లుగా పుత్తడి, వెండి ధరలు నాన్‌స్టాప్‌గా పెరుగుతూనే ఉండటంతో సామాన్యులు అటు చూడాలంటేనే భయపడుతున్నారు. రేపు ఉగాది కాగా..ఈరోజు ఏకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో 91వేల రూపాయల మార్క్ దాటగా కిలో వెండి ఏకంగా లక్షా 15 వేల మార్కుకు దగ్గర అయింది.

అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారమే.. బంగారం , వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి వీటి ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. మొత్తంగా చూసుకుంటే ఏడాదికేడాది పెరగడమే కానీ తగ్గడం మాత్రం కనిపించలేదు. తాజాగా..మరోసారి కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 83,410 రూపాయలు, 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర 90,990 రూపాయలుగా ఉంది. వెండి కిలో ధర 1,05,100 రూపాయలుగా ఉంది. మొత్తంగా దేశవ్యాప్తంగా పది గ్రాముల బంగారంపై 1100 రూపాయలు, వెండి కిలోపై దాదాపు 3వేల రూపాయలు వరకూ ధర పెరిగింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పుత్తడి ధర 83,410 రూపాయలు, 24 క్యారెట్ల పసిడి ధర 90,990 రూపాయలుగా ఉండగా..ముంబై, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడలో కూడా అదే ధర కొనసాగుతుంది. అయితే ఢిల్లీలో మాత్రం 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 83,560 రూపాయలు, 24 క్యారెట్ల ధర 91,140 రూపాయలుగా ఉంది.మరోవైపు హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర 1,14,100రూపాయలు ఉండగా..విజయవాడ, విశాఖపట్నంలో కూడా అదే ధర కొనసాగుతుంది.