Video: గోల్డ్‌ కార్డ్‌ మీద ట్రంప్ బొమ్మ

Trump's Picture On A Gold Card,Airforce-1, America, America Citizenship, Donald Trump, EB-5 Investar Visa, Gold Card, Green Card, Trump’s Picture On A Gold Card,Mango News,Mango News Telugu,National News,Global News,World News,Gold Card,USA,US,USA Gold Card,Visa,America Gold Card,America Gold Card Citizenship,America Green Card,Donald Trump News,Donald Trump Latest News,Donald Trump Tariff Live Updates,Donald Trump Tariff Updates,Donald Trump Tariff,President Trump,President Donald Trump,Trump Shows Off $5M Gold Card,Trump Reveals Gold Card With His Image,TRUMP unveils $5 MILLION GOLD CARD,Trump Unveils First Look of $5 Million Gold Card Visa,Gold Card Visa,US President Donald Trump,Trump Gold Card

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు చేపట్టాక.. సంచలన నిర్ణయాలతో అమెరికన్లతో పాటు ఆ దేశంలో స్థిరపడిన వారిని కూడా టెన్షన్‌ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రపంచ దేశాలసై సుంకాల మోత మోగించి హాట్ టాపిక్ అయ్యారు. ఇక జన్మతః సిటిజన్‌షిప్‌ను కూడా రద్దు చేశారు. గ్రీన్‌కార్డులో శాశ్వత సభ్యత్వం రాదని ప్రకటించి… వాటి స్థానంలో గోల్డ్‌ కార్డు కూడా ప్రవేశపెట్టారు.

అమెరికా పౌరసత్వం కోరుకునేవారి కోసంఇటీవల ‘గోల్డ్‌ కార్డ్‌’ పథకాన్ని ప్రకటించిన ట్రంప్‌ .. తాజాగా, ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ కార్డు ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ గోల్డ్ కార్డు ట్రంప్‌ చిత్రంతో ఉండగా.. 5 మిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.43.5 కోట్లు చెల్లించి ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ట్రంప్ తెలిపారు. తానే ఈ మొదటి కార్డును సొంతం చేసుకున్నానని చెప్పిన ట్రంప్.. రెండో కార్డు కొనేవారు ఎవరో తెలియదంటూ చెప్పారు. రెండు వారాల్లో ఈ కార్డులు అమ్ముడయిపోతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

గోల్డ్ కార్డు పథకం కింద ఈబీ–5 ఇన్వెస్టర్‌ వీసా విధానాన్ని రద్దు చేసి ఈ కార్డును ప్రవేశపెట్టారు. గోల్డ్‌ కార్డు కొనుగోలు చేసినవారు ఎవరైనా సరే నేరుగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఈ కార్డు చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించడంతో పాటు మోసాలను అరికడుతుందనే భావనలో ట్రంప్ ఉన్నారు. ఈ పథకం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని.. దీనికి తోడు సంపన్న వలసదారులను ఆకర్షించాలనేది ట్రంప్‌ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రపంచంలో 3.7 కోట్ల మందికి ఈ కార్డు కొనే సామర్థ్యం ఉన్నట్లు అక్కడి ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా తొలి రోజే 1000 కార్డులు విక్రయించామని, దీని ద్వారా 5 బిలియన్‌ డాలర్లు సేకరించామని అక్కడి అధికారులు చెబుతున్నారు.