Video: పిల్లల్ని కనాలని సీఎం చంద్రబాబు పదేపదే ఎందుకు పిలుపునిస్తున్నారు?

Why Is CM Chandrababu Repeatedly Calling For People To Have Children,CM Chandrababu,CM Chandrababu Repeatedly Calling For People To Have Children,financial grants,Uttar Pradesh,youth people,Mango News,Mango News Telugu,Andhra Pradesh News,Andhra Pradesh Latest News,AP,AP News,AP Latest News,CM Chandrababu Live,CM Chandrababu News,CM Chandrababu Latest News,Chandrababu Naidu Speech,AP Development,CM Chandrababu Naidu,Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu,CM Chandrababu Press Meet,Why Is Chandrababu Naidu Asking People To Have More Children,Why Chandrababu Naidu Wants You To Make More Babies,Andhra Pradesh CM Chandrababu Naidu's New Policy

ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ పదేపదే ఏపీవాసులకు పిలుపునిస్తున్నారు. జనాభా ఎంతగా పెరిగితే రాష్ట్రానికి అంత మంచిదని సీఎం చెబుతున్నారు. జనాభా తగ్గితే ప్రమాదకరమని.. జనాభా పెరగాలంటే ప్రతి ఒక్కరూ పిల్లలను ఎక్కువగా కనాలంటూ పిలుపునిస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లాలో జరిగిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి హాజరైన సీఎం మరోసారి కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు.

యూపీ, బీహార్లలో ఎక్కువ జనాభా ఉండడం సమస్య కాదని చంద్రబాబు.. అది స్వాగతించాల్సిన విషయమని చెప్పుకొచ్చారు. ఎక్కువ జనాభా ఉండడం ప్రయోజనకరమని చెప్పారు. అనేక దేశాల్లో వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని.. యూరప్ చైనా జపాన్లలో కూడా వృద్ధుల సంఖ్య ఎక్కువేనని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా పెరుగుదలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అందుకే ఎక్కువమంది పిల్లలను కనాలని చంద్రబాబు అన్నారు.

సాధారణంగా పెరుగుతున్న ఖర్చులకు తాము బతకడమే ఎక్కువని..అందుకే ఒక్కరిని కని వారికి ఏ లోటూ రాకుండా చేయాలని ఒక సంతానానికే అంతా ఓటేస్తున్నారు. అయితే అది తప్పుడు అభిప్రాయం అంటున్నారు సీఎం చంద్రబాబు . ఎందుకంటే పిల్లలను కనక పోవడం వల్ల యువత సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుతాయి.

యువత అనేది నిరంతరాయంగా ఉత్పత్తి జరిగితేనే ఈ ఉద్యోగ,ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. జనాభా తగ్గిపోవడం వల్ల యువత సంఖ్య కూడా తగ్గిపోతుందని అది దేశానికే ప్రమాదకరమని చంద్రబాబు అభిప్రాయం. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువ కావడం వల్లే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రయోజనాలు కూడా ఈ రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో దక్కడం లేదన్నది చంద్రబాబు వాదన.ఎందుకంటే ఆర్థిక సంఘం నిధులను జనాభాను అనుసరించి దానికి తగిన విధంగా కేటాయిస్తారు. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక సంఘం నిధులు కూడా తగ్గిపోతున్నాయి. ఇటు యూత్ తగ్గడం వల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పడుతున్నాయి.

తాజాగా జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అంతంత మాత్రమే ఉంది. దీంతో ఇక్కడితో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలు ఎక్కువగా పెరుగుతున్నాయన్నది దక్షిణాది నేతలు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన చంద్రబాబు కూడా ఏపీలో కూడా జనాభా పెరుగుదల ఉండాలని పదేపదే చెబుతున్నారు.