పుత్తడి ప్రేమికులకు బంగారం లాంటి వార్త

కొత్త ఏడాదిలో గతంలో ఎన్నడూ లేనంత ధరలలో బంగారం రేట్లు పెరిగి వినియోగదారులకు రోజుకో రకంగా షాక్ ఇస్తున్నాయి. వంద రూపాయలు తగ్గితే.. 5,6వందలు పెరుగుతూ తగ్గేదేలే అన్నట్లుగా ధరలు పెరుగుతూ అటు విశ్లేషకులు కూడా అంచనా వేయలేని స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల 2 రోజుల్లోనే 6 వేలు పెరగడం, ఒక్కరోజులోనే 2600 రూపాయలు పెరగడంతో ఇక బంగారం కొనలేమన్న నిర్ణయానికి సామాన్యులు వచ్చేశారు.

ఒకవైపు పెళ్లిళ్ల సీజన్​, మరోవైపు అక్షయ తృతీయ వేళ పసిడి ధరలు ఈ స్థాయికి చేరడంతో బంగారం కొనాలనుకున్నవారంతా భయపడుతున్నారు.. ఈ సమయంలోనే పసిడి ప్రియులకు శుభవార్త వచ్చింది. బుధవారం అంటే ఏప్రిల్ 23న బంగారం ధరలు భారీగా తగ్గడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క రోజులోనే దాదాపు రూ.3 వేల మేర బంగారం ధర తగ్గడంతో ఈ పది రోజుల్లో బంగారం కొనాలనుకున్నవారంతా జ్యువెలరీ షాపులకు క్యూ కడుతున్నారు. లైవ్‌ మార్కెట్‌లో రూ.99,000 అటూ ఇటుగా బంగారం ట్రేడవుతోంది.

గత రెండు రోజులుగా పసిడి ధరలు ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి చేరడంతో, బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర లక్ష మార్కును దాటేసింది. పెళ్లిళ్ల సీజన్​, అక్షయ తృతీయ వేళ పుత్తడి ధరలు ఈ స్థాయికి చేరడంతో వినియోగదారులు భయపడ్డారు. ఇలాంటి సమయంలో ఒక్క రోజులోనే దాదాపు రూ.3 వేల మేర బంగారం ధర తగ్గడం పసిడి ప్రియులకు నిజంగా పండుగ లాంటి వార్త వినిపించినట్లయింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 99,120 రూపాయలకి చేరుకోగా…. 22 క్యారెట్ల ధర 90,150 రూపాయలుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో 98వేల 710 రూపాయలుగా ఉంది.ఇవే ధరలు విశాఖపట్నం,విజయవాడ, బెంగళూరు, చెన్నైలోనూ కొనసాగుతున్నాయి.