దంతాల సరైన అమరిక (aligners) కోసం వాడుతున్న విజిబుల్ మరియు ఇన్విజిబుల్ అలైన్మెంట్లపై డాక్టర్ రవళి గారు ముఖ్యమైన విషయాలు పంచుకున్నారు.
సాధారణంగా బ్రేసెస్తో పోలిస్తే, ఇన్విజిబుల్ అలైన్మెంట్స్ చికిత్సలో సౌకర్యం, శుభ్రత సులభంగా ఉంటాయని ఆమె వివరించారు. ఈ అలైన్మెంట్స్ను 15 రోజులకోసారి మార్చాల్సి ఉంటుందని, చికిత్స కాలం సుమారు 12 నుంచి 18 నెలలు పట్టే అవకాశం ఉందని తెలిపారు.
దంతాల అమరికలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చని, ముఖ్యంగా శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అని డాక్టర్ రవళి స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం ‘Mango Life’ ఛానెల్లో వీడియో చూడవచ్చు.




































