సూపర్‌ స్టార్‌ కృష్ణ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల సంతాపం

AP CM Jagan and Several Political Leaders Film Celebrities Expressed Grief Over Passing Away of Actor Krishna,Jagan Expressed Grief Passing Away of Krishna, Celebrities Expressed Condolences,Superstar Krishna Passes Away,Tollywood Senior Actor Krishna, Superstar Krishna Hospitalized,Superstar Krishna Illness,Mango News,Mango News Telugu,Actor Superstar Krishna,Superstar Krishna,Senior Actor Krishna,Superstar Krishna Latest News And Updates,Actor Krishna, Actor Krishna Hospitalized,Krishna Hospitalized,Krishna News And Live Updates,Superstar News And Updates

ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, టీడీపీ అధినేత, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీపీసీకి చీఫ్ రేవంత్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, తోటి నటి నటులు సంతాపం వ్యక్తం చేసి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్. ఆయనే అల్లూరి.. ఆయనే మన జేమ్స్ బాండ్.. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు. మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను – సీఎం జగన్.

ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ ఘట్టమనేని కృష్ణ గారు పరమపదించటం అత్యంత విచారకరం. వారు ఎంచుకునే పాత్రలు యువశక్తికి చిహ్నంగా ఉండేవి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నాను – మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ గారి మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహసనిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. కృష్ణగారి మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయింది. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబుకు ఇది తీరని వేదన. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను – టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.

సినీ వినీలాకాశంలో సూపర్ స్టార్ గా వెలిగి, తెలుగు ప్రజల గుండెల్లో నటశేఖరుడిగా నిలిచిన కృష్ణగారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని భగవంతుడిని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి – టీపీసీకి చీఫ్ రేవంత్ రెడ్డి.

సూపర్ స్టార్ కృష్ణ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. విభిన్న పాత్రలతో ఆయన చేసిన ప్రయోగాలు, వేగంగా సినిమాలు పూర్తి చేయడంలో సృష్టించిన రికార్డులు, నేటి సినీ రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు ఒక మార్గం. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి – నారా లోకేష్.

కృష్ణ గారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.. ఆయనతో కలిసి 3 సినిమాల్లో నటించడం నా జ్ఞాపకాలు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను – తమిళ అగ్ర హీరో రజనీకాంత్.

కృష్ణ గారు అంటే సాహసానికి మరో పేరు. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, విలక్షణమైన పాత్రలే కాకుండా, సాంకేతికంగా కూడా తెలుగు సినిమాకు ఎన్నో విధానాలు పరిచయం చేసిన మీ ఘనత ఎప్పటికి చిరస్మరణీయం – జూ.ఎన్టీఆర్.

సూపర్ స్టార్ కృష్ణ గారి మృతితో ఒక శకం ముగిసింది. మహేష్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. మీరు, నేను మరియు ప్రతి తెలుగు సినీ అభిమానితో సహా కృష్ణ గారి కుటుంబానికి మద్దతుగా నిలిచే సమయం ఇది – హీరో నాని.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 7 =