నేడు ఒకేసారి 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తరగతులను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR will Virtually Commence Teaching Classes in 8 New Govt Medical Colleges Simultaneously Today,TRS Govt To Inaugurate Medical Colleges,Telangana TRS Govt, TRS Govt 8 Medical Colleges Opening,Mango News,Mango News Telugu,TRS Govt, Telangana Politics Latest News And Updates,Telangana CM KCR, KTR, Kalavakuntla Kavitha, Telanagana TRS,K Chandra Shekar Rao,Kalavakuntla Taraka Rama Rao,TRS Latest News And Updates, TS 8 Medical Colleges Opening, TS Medical Colleges Opening

తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యకు సంబంధించి నేడు మరో గొప్ప ముందడుగు పడబోతోంది. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన 8 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో విద్యాబోధన తరగతులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు (నవంబర్ 15, మంగళవారం) మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఒకేసారి ప్రారంభించనున్నారు. తద్వారా సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండం పట్టణాల్లోని 8 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ తొలి విద్యాసంవత్సరం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ 8 వైద్య కళాశాలలతో రాష్ట్రంలో అదనంగా 1,150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

ముందుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 5 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భవించి, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో భాగంగా మొదటి దశలో మహబూబ్‌నగర్‌, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటలో నాలుగు వైద్య కళాశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత రెండో దశలో సంగారెడ్డి, మహబూబాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, వనపర్తి, కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, రామగుండంలలో 8 వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. ఈ ఎనిమిది కళాశాలల్లోనే నేడు మొదటి సంవత్సరం తరగతులను సీఎం కేసీఆర్ ఒకేసారిగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 17కు చేరగా, వచ్చే ఏడాది 9, ఆపై ఏడాది మరో 8 కళాశాలలను ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకో వైద్య కళాశాల లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేస్తూ, “సీఎం కేసీఆర్‌ దార్శనికతతో కూడిన నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం 1సంవత్సరంలో 8 మెడికల్ కాలేజీలను నెలకొల్పడం ఒక రికార్డు. సీఎం కేసీఆర్ వర్చువల్ గా నవంబర్ 15 కళాశాలలను ప్రారంభిస్తారు మరియు అదే రోజు తరగతులు ప్రారంభమవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుండి సున్నా సహకారం మరియు పదేపదే వివక్ష తెలంగాణ ప్రభుత్వాన్ని ఆపలేదు ఎందుకంటే సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తారు మరియు 8 సంవత్సరాలలో వైద్య కళాశాలలను 5 నుండి 17కు పెంచారు” అని పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + two =