రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ

AP CM YS Jagan Mohan Reddy Called on President Droupadi Murmu Today at Rashtrapati Bhavan, YS Jagan Mohan Reddy Called on President Droupadi Murmu Today at Rashtrapati Bhavan, AP CM YS Jagan Meets President Droupadi Murmu, President Droupadi Murmu, Rashtrapati Bhavan, AP CM YS Jagan Mohan Reddy, YS Jagan Mohan Reddy, AP CM YS Jagan Delhi Tour, AP CM YS Jagan Delhi Visit, AP CM YS Jagan Delhi Tour News, AP CM YS Jagan Delhi Tour Latest News And Updates, AP CM YS Jagan Delhi Tour Live Updates, Mango News, Mango News Telugu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం వైఎస్ జగన్ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా ఉన్నారు.

ముందుగా సోమవారం ఉదయం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పెండింగు బిల్లులు మంజూరు, నిర్వాసితులకు పునరావాస కల్పన, విభజన అంశాలు పరిష్కారం, తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, మరో 12 మెడికల్ కాలేజీలకు అనుమతులకు సంబంధించి ప్రధానికి సీఎం వైఎస్ జగన్‌ వినతి పత్రం అందజేశారు. అనంతరం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌తో అరగంట పాటుగా సీఎం భేటీ అయి, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై చర్చించినట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని, గన్నవరంకు బయల్దేరారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =