ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం, కొత్త నమూనాతో పదో తరగతి పరీక్షలు

Andhra Pradesh Education Department, AP Education Department, AP Education Department Issued GO over Conducting SSC Exams, AP SSC Exams, AP SSC Exams 2021, AP SSC Exams New Schedule, AP SSC Exams News, AP SSC Exams Updates, GO over Conducting SSC Exams in a New Model, Mango News, SSC Exams in a New Model, SSC Exams Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షలను కొత్త నమూనా (ప్రశ్నాపత్రం) తో నిర్వహించాలని నిర్ణయిస్తూ పాఠశాల విద్యాశాఖ గురువారం నాడు జీవో విడుదల చేసింది. ఇంతకు ముందు ఒక్కో సబ్జెక్ట్‌ కు 100 మార్కులకు గానూ 80 మార్కులకు వార్షిక పరీక్షలు నిర్వహించి, 20 మార్కులకు ఇంటర్నల్‌ పరీక్షల నుంచి తీసుకునేవారు. అయితే ఈసారి ఆ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా మొత్తం 100 మార్కులకు పరీక్షలను నిర్వహించనున్నారు.

ఫస్ట్‌ లాంగ్వేజ్, సెకండ్‌ లాంగ్వేజ్, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ పరీక్షలను 100 మార్కులకు, సైన్స్ ‌ను రెండు పేపర్లుగా (భౌతికశాస్త్రం 50 మార్కులు, జీవశాస్త్రం 50 మార్కులు) మొత్తం 7 పరీక్షలను నిర్వహించనున్నారు. కొత్త ప్రశ్నాపత్రం నమూనా ప్రకారం ఆబ్జెక్టివ్ ప్రశ్నలు(12×1 మార్కులు=12), అతి స్పల్ప ప్రశ్నలు(8×2 మార్కులు=16), స్పల్ప ప్రశ్నలు (8×4 మార్కులు=32), వ్యాసరూప ప్రశ్నలు (5×8 మార్కులు=40) ఉండనున్నాయి. పరీక్ష సమయాన్ని రెండున్నర గంటలుగా నిర్ణయించారు. మరోవైపు జూన్ 7, 2021 నుంచి జూన్ 16, 2021 వరకు ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ