
పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికినట్లు.. మాజీ సీఎం జగన్ బాధ్యత లేకుండా చేసిన పనులతో ఏపీ పూడ్చలేని కష్టాల్లో పడిందనడానికి రుషికొండ ప్యాలెస్ ఒక ఉదాహరణ అనే చెప్పొచ్చు. జగన్ చేసిన నిరంకుశ పనులతో ఆంధ్రప్రదేశ్ సర్కారు తలపట్టుకునే పరిస్థితుల్లో పడింది. రుషికొండలో ఉన్న రిసార్టును కూల్చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కొండను తొలిచేసి మరీ పెద్ద ప్యాలెస్ కట్టించారు. హరిత రిసార్ట్ ప్రజలకు ఉపయోగపడటం లేదంటూ డ్రామాలాడి మళ్లీ అక్కడ టూరిజం ప్రాజెక్టు కడతామని జనానికి అబద్ధాలు చెప్పి మరీ గుట్టుచప్పుడు కూడా అక్కడ ప్యాలెస్‌ను కట్టారు. కానీ జగన్ ప్రభుత్వం గద్దె దిగాక కానీ అసలు సంగతి బయటపడలేదు. అది టూరిజం ప్రాజెక్ట్ అని కలరింగ్ ఇచ్చినా..అది మాత్రం రాజభవనాన్ని మించి ఉండటంతో ఏపీ వాసులు కంగుతిన్నారు. చివరకు అలాంటిది దేశ ప్రధానికి కూడా లేదని తేలింది. జనం డబ్బుతోనే కట్టించిన ఆ ప్యాలెస్‌ను జల్సా చేయడానికి కట్టుకున్నారని ప్రపంచానికి తెలిసిపోయింది.కానీ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయిన జనాలు ఇచ్చిన తీర్పుతో జగనన్నకు బాగా అర్ధం అయింది.
అయితే ఇదంతా పక్కన పెడితే ఆ ప్యాలెస్ లో 12 బెడ్ రూంలే ఉండటంతో అది హోటల్‌కు పనికిరాదు. అలా అని గవర్నమెంట్ టూరిజానికి వాడతారా అంటే దానికీ పనికిరాదు. పోనీ చంద్రబాబు క్యాంపు ఆఫీసుగా వాడుకుంటారా అంటే.. అంత ఖరీదైన ప్యాలెస్ ను వాడటానికి ఆయన ఇష్టపడరు.రూ. 550 కోట్లు పెట్టిన ఆ ప్యాలెస్ .. అద్దెకు ఇస్తే పావలా వడ్డీ కూడా రాదని అధికారులు తేల్చేశారు. దీంతో ఉపయోగకరంగా మార్చాలంటే ఏం చేయాలా అని ఆలోచించిన చంద్రబాబు.. టాటా గ్రూపును సంప్రదించారట.
టాటా గ్రూపు మూడు బ్రాండ్ల కింద హోటల్స్‌ను నడుపుతోంది. అందులో పెద్ద బ్రాండ్ ఐహెచ్‌సీఎల్ అంటే ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉంది. హైదరాబాదులో ఉన్న తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లాగా రుషి కొండ ప్యాలెస్‌ను కూడా టాటా గ్రూపు నిర్వహణకు ఇచ్చేయాలని ఆలోచిస్తున్నామని చంద్రబాబు సందేశాన్ని పంపించారట. అలా దాని నుంచి వచ్చిన ఆదాయాన్ని అన్నా క్యాంటీన్లకు వాడితే బాగుంటుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారట.
ఈ ఆఫర్‌ను టాటా గ్రూప్‌కు పంపడం వెనుక పెద్ద లెక్కలే ఉన్నాయట. టాటా ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన బ్రాండ్ అంతేకాదు సేవా ధృక్పథంతో పని చేసే సంస్థ. అందుకే ఆ సంస్థ అయితే దీనిని బాగా నిర్వహించగలదన్న నమ్మకంతో టాటా గ్రూప్స్‌ను సంప్రదించారట ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు. అయితే ఇంకా వారి నుంచి ఎలాంటి జవాబు రాలేదని తెలుస్తోంది. అయితే అంత ఈజీగా ఆ ఆఫర్‌ను టాటా ఒప్పుకోదని..దాని గురించి బాగా ఎంక్వైరీలు చేసి తమ నిర్ణయాన్ని చెబుతామని ఏపీకి చెప్పినట్లు తెలుస్తోంది.
టాటా గ్రూప్స్ అలా అనడం వెనుక ఓ రీజనుంది. ఫలక్ నుమా ప్యాలెస్ హెరిటేజ్ సైట్..కాబట్టి రుషికొండ ప్యాలెస్‌ను దాంతో పోల్చలేం. రుషికొండ ప్యాలెస్ కు హిస్టారిక్ ఇంపార్టెన్స్ లేదు. కేవలం లగ్జరీ ప్యాలెస్ గా మాత్రమే చూస్తారు. లగ్జరీ కోసం మహా అయితే ఒక రూముకు రోజుకు అద్దె ఒక లక్ష నుంచి రెండు లక్షలు ఉంటుంది. అక్కడున్న 12 గదులు ద్వారా రోజుకు 24 లక్షలు సంపాదించొచ్చు. ఖర్చులు పోతే అందులో 10 లక్షలు మిగిలే అవకాశం ఉంది. నిజానికి జగన్ ప్యాలెస్ కోసం ఖర్చు చేసిన 550 కోట్లు బ్యాంకులో వేస్తే.. ఏడాదికి 40 కోట్లు వడ్డీ వస్తుంది. కానీ ఇప్పుడు అంత ఖరీదయిన ప్యాలెస్‌ను అద్దెకు ఇచ్చినా కూడా ఏడాదికి 40 కోట్లు రావు. పోనీ ఆ ప్యాలెస్‌ను అమ్మేద్దామా అంటే రుషికొండను ప్రైవేటు పరం చేయడం ఏపీ సర్కార్‌కు అసలు ఇష్టం లేదు. మొత్తంగా నెలరోజుల్లోపు రుషికొండ ప్యాలెస్‌పై ఏదొక నిర్ణయం తీసుకోవాలని పట్టుదలతో ఉన్నారట చంద్రబాబు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE