వైద్య, ఆరోగ్య శాఖలో 2,588 పోస్టుల భర్తీకి ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

ind vs wi, IND vs WI T20, IND vs WI T20 Series, ind vs wi t20 series 2022, IND vs WI T20 Series Rishabh Pant Promoted As India’s Vice-Captain, IND vs WI Team India, india vs west indies, India vs West Indies ODIs, Mango News, Mango News Telugu, Rishabh Pant Promoted As India’s Vice-Captain, Rishabh Pant Promoted As India’s Vice-Captain Washington Sundar Ruled Out, sports news, T20Is, Washington Sundar Ruled Out

వైద్య, ఆరోగ్య శాఖలో కొత్త పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ వైద్య, ఆరోగ్య శాఖలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయటానికి కొత్త పోస్టులను సృష్టిస్తూ నియామకాలు చేపట్టింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర 2,588 పోస్టుల భర్తీకి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ పంపిన ప్రతిపాదనల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పోస్టులను సృష్టించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీని ప్రకారం.. ఆసుపత్రి పరిపాలన విభాగానికి సంబంధించి 54 పోస్టులు, ఇతర పోస్టులు 949 ఉన్నాయి. అలాగే, డాక్టర్ పోస్టులు 485, పారామెడికల్‌ క్లాస్‌-4 కోసం 644, ల్యాబ్‌ టెక్నీషియన్స్ 279, నర్సింగ్ స్టాఫ్ 60, ఫార్మసీ సిబ్బంది 78, పోస్ట్‌మార్టమ్‌ సహాయకుల పోస్టులు 39. అయితే, వీటిలో పలు పోస్టులను ప్రత్యక్ష పద్ధతిలో శాశ్వత, కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ విధానంలో, మరికొన్ని పోస్టులను పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =