తెలంగాణలో కొత్తగా 614 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 2387 మంది బాధితులు

AP CM YS Jagan Decides to Lift the Night Curfew in the State

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 614 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఫిబ్రవరి 14, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 7,84,062కి చేరింది. ఇక కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,107 గా ఉంది. అలాగే మరో 2,387 మంది కోలుకోగా, ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 7,70,047కు చేరుకుంది. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 131, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 48, రంగారెడ్డిలో 43, ఖమ్మంలో 31, యాదాద్రి భువనగిరిలో 24, సూర్యాపేటలో 23, మహబూబ్ నగర్ లో 23, కరీంనగర్ లో 22 నమోదయ్యాయి.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు (ఫిబ్రవరి 14, సాయంత్రం 5.30 గంటల వరకు):

  • రాష్ట్రంలో నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,30,37,962
  • రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు : 7,84,062
  • కొత్తగా నమోదైన కేసులు : 614
  • కొత్తగా నమోదైన మరణాలు : 0
  • రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 7,70,047
  • కరోనా రికవరీ రేటు: 98.21%
  • యాక్టీవ్ కేసులు: 9,908
  • నమోదైన మొత్తం మరణాల సంఖ్య: 4,107
  • కరోనా మరణాల రేటు: 0.52%
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + thirteen =