ఏపీ: వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌లో సేవల కోసం, 1,681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

AP Notification Released For 1681 MLHP Posts Recruitment To Services in YSR Village Health Clinics, Notification Released For 1681 MLHP Posts Recruitment To Services in YSR Village Health Clinics, 1681 MLHP Posts Recruitment To Services in YSR Village Health Clinics, Notification Released For 1681 MLHP Posts Recruitment, YSR Village Health Clinics, 1681 MLHP Posts Recruitment, YSR Village Health Clinics Recruitment, 1681 MLHP Posts, YSR Clinics Recruitment Notification 2022, 2022 YSR Clinics Recruitment Notification, YSR Clinics Recruitment Notification, YSR Health Clinic Notification Update, Mid Level Health Provider, YSR Village Health Clinics Recruitment News, YSR Village Health Clinics Recruitment Latest News, YSR Village Health Clinics Recruitment Latest Updates, YSR Village Health Clinics Recruitment Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ ఫీల్డ్ కి చెందిన నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ‘వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌’లో సేవలు అందించేందుకు గాను 1,681 మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు వైద్య శాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు అధికారులు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు సుమారు 10,000 లకు పైగా ‘వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌’ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్లినిక్స్‌లో సేవలందించడానికి గాను ఎంఎల్‌హెచ్‌పీలను నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా 1,681 ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు అధికారులు. ఇప్పటికే 8,351 పోస్టుల భర్తీ పూర్తవగా, మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు.

నోటిఫికేషన్‌ వివరాలు..

 • ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిణ – ఆగస్ట్ 9 నుంచి 22 వరకు
 • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లాగిన్ కావాల్సిన వెబ్ సైట్ – hmfw.ap.gov.in (లేదా) cfw.ap.nic.in
 • హాల్‌టికెట్లు జారీ – ఆగస్ట్ 24 నుంచి 30 వరకు
 • పరీక్ష జరుగు తేదీ – సెప్టెంబర్ మొదటి వారం (పరీక్ష తేదీ హాల్‌టికెట్‌లలో తెలియజేస్తారు)

అర్హతలు:

 • ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసి ఉండాలి.
 • సర్టిఫికెట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
 • నోటిఫికేషన్‌ జారీ చేసిన తేదీ నాటికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి.
 • ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు 10 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.

పరీక్ష విధానం..

 • బీఎస్సీ నర్సింగ్‌ సిలబస్‌ నుంచి 200 ప్రశ్నలకు మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ప్రశ్నలు
 • మొత్తం మార్కులు – 200 (ప్రతి ప్రశ్నకు ఒక మార్కు)
 • పరీక్ష సమయం 180 నిమిషాలు (మూడు గంటలు)

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here