తెలంగాణలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..

Case Against JC Prabhakar Reddy In Telangana, Case Against JC Prabhakar Reddy, JC Prabhakar Reddy Case, Telangana JC Prabhakar Reddy Case, Actor Madhavi Latha, Allians, JC Prabhakar Reddy, Rayalaseema, Case Files On JC Prabhakar Reddy, Madhavi Latha Case, Hyderabad, Hyderabad Live Updates, Latest Hyderabad News, Telangana, TS Politics, TS Live Updates, Political News, Mango News, Mango News Telugu

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తెలంగాణలో పోలీస్ కేసు నమోదు అవడం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీనటి, బీజేపీ నేత మాధవి లత చేసిన ఫిర్యాదుపై కేసు నమోదయింది. తనపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారని.. సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారని మాధవి లత జనవరి 21 వ తేదీన సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై జేసీపై కేసు నమోదు చేశారు పోలీసులు.

జేసీపై కేసు నమోదుతో కూటమి మధ్య సమన్వయ లోపానికి దారి తీస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొద్దిరోజులుగా జేసీ ప్రభాకర్ రెడ్డి, నటి మాధవి లత మధ్య గట్టి వివాదమే నడుస్తోంది. ఒకానొక దశలో దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గి..మాధవి లతను క్షమాపణలు కూడా కోరారు. అయితే అంతటితో ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని అంతా అనుకున్నా కూడా .. ఇప్పుడు ఏకంగా మాధవి లత జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కేసు నమోదు కావడం జరిగిపోయింది.

తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నూతన సంవత్సర వేడుకలను ఏర్పాటు చేసినపుడు.. మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ వేడుకలపై అప్పట్లో మాధవి లతతో, మరో మహిళా నేత యామిని అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా..జేసీ ఒక్కసారిగా రెచ్చిపోయి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మాధవి లతను ఉద్దేశించి నువ్వు ప్రాస్టిట్యూట్ అంటూ సంచలన ఆరోపణలు చేయడంతో.. వివాదం ప్రారంభం అయ్యింది. బీజేపీ నేతలు జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు సినీ పరిశ్రమ నుంచి కూడా అనేక రకాల కామెంట్స్ వచ్చాయి. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించి.. 73 ఏళ్ల వయసులో తాను ఆ వ్యాఖ్య చేసి ఉండకూడదని.. అందుకే క్షమాపణలు చెబుతున్నానని కోరారు. కానీ బీజేపీ నేతల విషయంలో సైతం ఎక్కడ వెనక్కి తగ్గలేదు.

ఈ సమయంలోనే జేసీకి చెందిన ఓ బస్సు అనంతపురంలో దగ్ధం కావడంతో..రాయలసీమలో బీజేపీ వర్సెస్ జేసీ అయితే రాయలసీమలో బీజేపీ వర్సెస్ జేసీ అన్నట్టుగా పంచాయతీ నడిచింది. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి,జేసీ ప్రభాకర్ రెడ్డి పంచాయతీ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరి.. చంద్రబాబు సముదాయించడంతో అంతా సద్దుమణిగింది. అటు సినీనటి మాధవీలతో వివాదం కూడా మరుగున పడిందని అంతా భావించారు.ఈరోజు ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు అవడంతో.. రాయలసీమలో వరుసగా జరుగుతున్న పరిణామాలు కూటమి పార్టీ నేతలు కలవరపడుతున్నారు.