భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించింది – సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Says, Bhagavan Satya Sai Baba's Ideals Now Spread Worldwide

భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన నేడు పుట్టపర్తిలో ‘సత్యసాయి శత జయంతి’ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రసంగించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవగా, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, తెలంగాణ మాజీ మంత్రి జె. గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు మరియు ప్రస్తుత పరిపాలన లక్ష్యాలపై ప్రధానంగా మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తామని, అవినీతి రహిత పాలనను అందిస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ, వాటిని తిరిగి గాడిలో పెట్టడం తమ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఇంకా ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యంగా యువతకు ఉద్యోగాలు, వ్యవసాయ రంగం పటిష్టత, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై తన ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు. అలాగే, పుట్టపర్తితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని, సత్యసాయిబాబా ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు.

ఇక అంతకుముందు రాష్ట్రపతి ముర్ము పుట్టపర్తి రాక సందర్భంగా సీఎం చంద్రబాబు, మ్నాత్రి లోకేష్ సహా పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here