అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చీ రాగానే ముద్రగడపై సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోల్స్ నడుస్తున్నాయి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిస్తే తాను పేరు మార్చుకుంటానని ముద్రగడ శపథాన్ని గుర్తు చేస్తూ ఆహ్వాన పత్రికలు కూడా రౌండ్లు కొట్టాయి. దీంతో ఉన్న కాస్త పరువు కూడా పోతుందని అనుకున్నారో ఏంటో కానీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభo చెప్పినట్టుగానే తాను పేరు మార్చుకుంటానని ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకోవడానికి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు కూడా రెడీ చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన పేరు మార్చుకోవడానికి అవసరమైన అన్ని పేపర్లను తాను మసిద్ధం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. 72 వేల పైచిలుకు మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగ గీతాపై ఘనవిజయాన్ని సాధించారు. అయితే పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో దిగిన సమయంలో.. పవన్‌కు అండగా ఉండాల్సిన కాపు నేత.. పవన్ పైనే ఛాలెంజ్ విసిరారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే… తన పేరు మార్చుకుంటానని ముద్రగడ శపథం చేశారు. జూన్ 4న రిలీజ్ అయిన ఫలితాలలో పవన్ కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించారు. దీంతో తాను చెప్పినట్లుగానే ఆ సవాల్ స్వీకరిస్తున్నానని.. ముందుగా చెప్పినట్లు తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని వెల్లడించారు. సవాల్‌లో తాను ఓడిపోయానని అందుకే తన పేరు మార్చుకోవడానికి సిద్ధమయ్యానంటూ సంచలన ప్రకటన చేశారు.
అంతేకాదు పవన్ కళ్యాణ్‌కు ముద్రగడ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అలాగే జగన్ మోహన్ రెడ్డి ఓటమిపై కూడా స్పందించిన ముద్రగడ పద్మనాభం.. జగన్మోహన్ రెడ్డి కోసం కష్టపడ్డ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏపీ ప్రజలకు మంచి చేసిన జగన్ ఓడిపోవడం తనకు చాలా బాధ కలిగించిందన్నారు. ఆయన ఓడిపోయినా కూడా తన ప్రయాణం జగన్మోహన్ రెడ్డి తోనే ఉంటుందని చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE