
ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష పార్టీల మేనిఫెస్టోలు రిలీజ్ అయ్యాయి. నాలుగు రోజుల క్రితం అధికార పార్టీ వైసీపీ విడుదల చేస్తే.. తెలుగుదేశం కూటమి మేనిఫెస్టోల మంగళవారం రిలీజ్ చేశారు. ప్రజలను ఆకర్షించేందుకు అందరూ పెద్దపీట వేశారు. ఆకర్షించే అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికార పార్టీ వైసీపీ.. ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షే పథకాలు కొనసాగిస్తూనే.. నిధులు పెంచింది. విద్య , వైద్యం, వ్యవసాయం, ఉన్నత విద్య , నాడు -నేడు, పేదలందరికీ ఇళ్లు, మహిళా సాధికారిత, సామాజిక భద్రత, అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటికే ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయని వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. పింఛన్లు సహా పలు పథకాలకు అందించే మొత్తాన్ని పెంచుతామన్నారు.
అలాగే.. సూపర్ సిక్స్, సూపర్ సిక్స్ 2.0 పేరుతో తెలుగుదేశం కూటమి కూడా మేనిఫెస్టో విడుదల చేసింది. మెగా డీఎస్పీపై తొలి సంతకం చేస్తానని, ఆడబిడ్డలకు రక్షణగా ఉంటా.. వారి భద్రతకు తనది భరోసా అంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. తాను సంపద సృష్టిస్తానని, ఆదాయం పెంచుతానని.. ఆ సంపదను మీకు పంచుతానని వివరించారు. 2047 నాటికి ప్రపంచంలోనే తెలుగువారు అగ్రస్థానంలో ఉండటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చానని తెలిపారు. ఇరు పార్టీల మేనిఫెస్టోలు బాగానే ఉన్నప్పటికీ.. ఒకరి మేనిఫెస్టోపై మరొకరు విమర్శలు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
చేయలేని పనులను మేనిఫెస్టోలో పొందుపరిచి ప్రజలను చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని జగన్ విమర్శిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు. గతంలో ఉన్న రుణమాఫీ, డ్వాక్రా రుణాలను చంద్రబాబు ఎగ్గొట్టారన్నారు. సింగపూర్‌ను మించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రతీ నగరంలోనూ హైటెక్ సిటీ లాంటివి కంపెనీలు తీసుకువస్తామని అబద్ధాలు చెప్పారన్నారు. కనీసం ప్రత్యేక హోదా అంశాన్ని కూడా పట్టించుకోకుండా.. అదేమైనా సంజీవనా? అంటూ వెటకారంగా మాట్లాడారని గుర్తుచేస్తున్నారు.
మరోవైపు.. చంద్రబాబు కూడా జగన్ మేనిఫెస్టోను విమర్శిస్తున్నారు. పది రూపాయలు ఇచ్చి, వంద రూపాయలు తీసుకునే మనస్తత్వం తనది కాదన్నారు. జగన్ విధానం జలగ మాదిరిగా రక్తం తాగే విధానమని ఆక్షేపిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే మనం అయిదేళ్లలో చేయబోయే పనులని.. అంతేగానీ జగన్ ఇంట్లో కూర్చుని బటన్ నొక్కేస్తానని అంటే కుదురుతుందా అని ప్రశ్నిచారు. తాను ఏం అభివృద్ధి చేయలేదని చెబుతున్నారు.. మరీ ఈ ఐదేళ్లలో జగన్ ఏం చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా జాబ్ కేలండర్ అమలు చేయలేదని, రైతులను మోసం చేశారని, కరెంట్ చార్జీలు పెంచారని విమర్శిస్తున్నారు. ఇలా ఒకరికొకరు.. మేనిఫెస్టోలపై ఫైట్ చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY