
నోటికి అదుపు ఇంటికి పొదుపు అవసరం అని పెద్దలు చెప్పినట్లు.. నోరుంది కదా అని ఎలాంటి శపథాలు అయినా చేసేస్తే.. చివరకు తల్లిదండ్రులు పెట్టిన పేరును కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీలో ముద్రగడ పద్మనాభం పరిస్థితి కూడా ఇలానే తయారయింది మరి. చివరకు ముద్రగడ పద్మనాభం కాస్తా.. ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోవాల్సి వచ్చింది.
నా కోడి, నా కుంపటి లేకపొతే తెల్లారదు అన్నట్టు తాను లేకపోతే కాపు సామాజిక వర్గమే లేనట్లు ప్రవర్తించిన ముద్రగడకు.. ఏపీ ఓటర్లు గుర్తుండిపోయే జవాబిచ్చారు. తానొక్కడూ లేకపోతే ఇక జనసేన గెలవడమే కష్టమన్నట్లు బిల్డప్పులిచ్చి.. వైసీపీలో తాను చేరితే కాపు సామాజికవర్గం అంతా వచ్చేసినట్లే అన్నట్లు మాట్లాడిన ముద్రగడ..ఎన్నికల ఫలితాల తర్వాత అన్నీ మూసుకుని సైలెంట్ అయిపోయారు.
కానీ అటు ఉంది జనసైనికులు కాబట్టి మౌనమేల ముద్రగడా..ఇచ్చిన మాట మరిచితివా అంటూ ఏకంగా నామకరణ మహోత్సవ ఆహ్వానాలతో ముద్రగడను హడలెత్తించారు. ఈ వయసులో ఉన్న కాస్త విలువను కూడా పోగొట్టుకోవడం ఎందుకనుకున్నారో ఏమో కానీ తాను పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానన్న మాట మీద నిలబడ్డానంటూ వెంటనే ప్రకటన చేశారు.
నిజానికి ఏపీ ఎన్నికల సమయంలో దేశ ప్రజల దృష్టంతా పిఠాపురంపైనే పడిందంటే అది అతిశయోక్తి కాదు. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయల మధ్య పెద్ద చర్చే నడిచింది.అదే రేంజ్‌లో పవన్ గెలుపుపై కూడా బెట్టింగ్‌లు పెరిగిపోయాయి.
ఇటు ఇదే సమయంలో ఏపీలో కాపు నేతగా పేరు గాంచిన ముద్రగడ పద్మనాభం .. పవన్‌కు వెన్నంటి ఉండవలసిన కీలక సమయంలో వైసీపీలో చేరడంతో పాటు.. పవన్ కళ్యాణ్‌ను ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. పోనీలే పాపం పెద్దాయన తన కొడుకు అధికారం కోసం పాకులాడుతున్నాడులే అని అంతా లైట్ తీసుకుంటే.. రామా కృష్ణా అనుకోవాల్సిన ఆ వయసులో కూడా పెద్దపెద్ద శపథాలే చేశారు .
అసలు పిఠాపురంలో పవన్ గెలిచే ప్రసక్తే లేదని..ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును కూడా మార్చుకుంటానంటూ ముద్రగడ సవాల్ విసిరారు. కానీ ఎన్నికల ఫలితాల్లో జనసేనాని భారీ మెజార్టీతో గెలుపొందడమే కాదు..ఇప్పుడు డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. దీంతో ముద్రగడ గత్యంతరం లేని పరిస్థితుల్లో తన పేరును మార్చాలని గెజిటెడ్ అధికారులను కోరారు.
తాజాగా దీనిపై స్పందించిన రిజిస్టర్ అధికారులు ముద్రగడ పద్మనాభం పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారుస్తూ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.ఇలా తప్పని సరి పరిస్థితుల్లో తప్పించుకోలేక ముద్రగడ పద్మనాభం..తన పేరును తన చేతులతో తానే చెరుపుకోవాల్సిన రాజకీయ నేతగా మిగిలిపోయారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE