కాశీబుగ్గ ఘటనపై ప్రధాని మోదీ సంతాపం.. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

PM Modi Announced Ex-gratia of Rs 2 Lakh For The Kin of Kasibugga Stampede

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర సంఘటన తన హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ మేరకు పీఎం కార్యాలయం (PMO) ద్వారా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

అందులో.. “ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలోగల వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట అత్యంత బాధాకరం. తమ సన్నిహితులను,కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు పీఎం ఎన్ ఆర్ ఎఫ్ ద్వారా రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా,గాయపడిన వారికి రూ. 50,000 మంజూరు చేస్తున్నాం” అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here