ఏపీలో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. తొలి రోజు సమావేశాలు రసవత్తరంగా సాగాయి. అలాగే పలు కీలక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు నల్లకండువాలతో నిరసన తెలపడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంతేకాకుండా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి మాట్లాడడం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది. అసలు వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు?.. ఎందుకు రఘురామకృష్ణం రాజు జగన్ వద్దకు వెళ్లారు అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి సభలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అక్కడున్న సభ్యులందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్లి తనకు కేటాయించిన కుర్చీ వద్దకు వెళ్లారు. అదే సమయంలో రఘురామకృష్ణం రాజు తన కుర్చీలో నుంచి లేసి వచ్చి జగన్‌ను పలకరించారు. ఆ తర్వాత జగన్ కుర్చీ వద్దకు వెళ్లి ఆయనతో మాట్లాడారు. కొద్దిసేపే వారి మధ్య సంభాషణ జరిగినప్పటికీ.. వారిద్దరు ఏమాట్లాడుకున్నారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అసలు రఘురామకృష్ణం రాజు జగన్ వద్దకు వెళ్లి మాట్లాడాల్సిన అవసరం ఏముందు.. అటు జగన్ ఏం మాట్లాడారు? అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
తాజాగా రఘరామకృష్ణం రాజు దీనిపై క్లారిటీ ఇచ్చారు. జగన్‌లో ఏం మాట్లాడారో వెల్లడించారు. ‘గతంలో ముఖ్యమంత్రిగా చేసిన వారు మీరు, మీ పార్టీ శాసనసభాపక్షానికి నాయకుడు మీరు, ఆ హోదాలో అసెంబ్లీకి రండి.. ప్రతిపక్ష నేత హోదా విషయం పక్కకు పెట్టి సభా సమావేశాలకు కచ్చితంగా హాజరు అవ్వండి’ అని జగన్‌తో అన్నానని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. అందుకు తప్పకుండా వస్తాను అని జగన్ సమాధానం ఇచ్చారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF